రవి : చనిపోయినోళ్లంతా మంచోళ్లే..! కానీ మోడీకి మాత్రం కాదు..!

చనిపోయినోళ్లంతా మంచోళ్లేనంటారు. ఎందుకంటే… ప్రాణాలతో లేని వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుకోవడం.. సంస్కారం కాదనే అలా అనుకుంటారు. కానీ.. రాజకీయాలకు ఈ సంస్కారాలేమీ ఉండవని… ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి నిరూపించారు. ఆయన రాజీవ్ గాంధీని.. అత్యంత దారుణంగా కించ పరిచే ప్రయత్నం చేశారు. అత్యంత అవినీతి పరునిగా.. రాజీవ్ గాంధీ చనిపోయాడని తేల్చారు. దీనిపై రాజకీయ దుమారం రేగింది.

చనిపోయిన రాజీవ్‌నూ వదలని మోడీ..!

రాజీవ్ గాంధీ రాజకీయ జీవితంలో బోఫోర్స్ ఓ మచ్చ. నిజానికి దశాబ్దాలు గడిచినా… కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా.. బోఫోర్స్ స్కాం గురించి మాత్రం.. ఎలాంటి విచారణ ముందుకు తీసుకెళ్లలేపోయారు. కానీ.. ఇప్పటికీ… బోఫోర్స్ పేరుతో రాజకీయం చేస్తూనే ఉంటారు. అలా మోడీ.. ఇప్పుడు బోఫోర్స్‌ను తీసుకొచ్చి… రాజీవ్‌ గాంధీ… నెంబర్ వన్ అవినీతి పరునిగా చనిపోయాడని.. లెక్క తేల్చారు. నిజానికి బోఫోర్స్ విషయంలో.. రాజీవ్ గాంధీకి కోర్టులు కూడా క్లీన్ చిట్ ఇచ్చాయి. ఈ విషయం మోడీకి తెలియకుండా ఉండదు. కానీ.. ఇప్పుడు నిందించాలి కాబట్టి… ఆ విషయాలను మర్చిపోయినట్లుగా నటించి… రాజీవ్ గాంధీపై నిందలు వేశారు. తాను చిక్కుకున్న రాఫెల్ డీల్‌ నుంచి.. బయటకు రావడానికి.. చనిపోయిన రాజీవ్ గాంధీని మోడీ అస్త్రంగా చేసుకున్నారు. ప్రధాని స్థాయిలోని వ్యక్తి… ఇలా చనిపోయిన వ్యక్తి ని విమర్శించడం ద్వారా ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. నిజానికి దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన ఇమేజ‌్ రాజీవ్ కు ఉంది. అలాంటి వ్యక్తిని నిందిస్తే.. సాధారణ ప్రజలు కూడా.. హర్షించరు.

రాజీవ్‌పై అంత అవినీతి ముద్ర ఉందా..? వేస్తున్నారా..?

రాజీవ్‌పై .. మోడీకి చాలా కోపం ఉందని… తాజా వ్యాఖ్యలతో తేలిపోయింది. గతంలోనూ.. ఆయన రాజీవ్ గాంధీపై విమర్శలు చేశారు. దానికి ఆయన ఎంచుకున్న ఉదాహరణలే… రివర్స్ విమర్శలకు కారణం అయ్యాయి. రాజీవ్ గాంధీ… అనూహ్య పరిస్థితుల్లో ప్రధానమంత్రి అయ్యారు. పేదల కోసం ఆయన చాలా చేశారు. దేశం కోసం చాలా చేశారు. పేదల కోసం.. అందుతున్న పథకాలు.. వారికి పూర్తి స్థాయిలో అందకపోతూండటంతో… ఓ సందర్భంలో పేదప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కేటాయించే ప్రతి రూపాయిలో 15శాతం మాత్రమే గ్రామాలకు చేరుతుందని, మిగిలన 85 పైసలు కంటికి కనిపించకుండా పోతుందని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని అధగిమించడానికి ఆయన అప్పట్నుంచే చర్యలు ప్రారంభించారు. కానీ మోడీ మాత్రం… ఆ వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేసి.. కాంగ్రెస్ అవినీతిని నిర్మూలించడానికి ప్రయత్నించలేకపోయిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఇంత టెక్నాలజీ వచ్చి.. ఆధార్ పేరుతో.. ప్రతి వ్యక్తి వ్యవహార రికార్డు చేస్తున్న సమయంలోనూ.. మోడీ సర్కార్ అవినీతిని ఆపలేకపోయారు. కానీ ఏ టెక్నాలజీ లేని కాలంలో రాజీన్.. నిజాల్ని నిర్భయంగా అంగీకరించి… అవినీతిని అంతం చేసే ప్రయత్నం చేశారన్నది నిజం. కానీ మోడీ ఇప్పుడు… అవినీతి పరులకు అండగా నిలుస్తున్నారనేది ప్రత్యక్ష సాక్ష్యం.

చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు చప్పట్లు కొట్టి ఓట్లేస్తారా..?

చరిత్రను వక్రీకరించి..మోడీ… రాజకీయం చేయడం ఇదే మొదటి సారి కాదు. గాంధీ, నెహ్రూ కుటుంబాలపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యనాలు చేస్తూనే ఉంటారు. నాడు సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే..నేడు కశ్మీర్ సమస్య ఉండేది కాదంటారు. ఆ సరైన నిర్ణయం ఏమిటో… చెప్పలేరు. ఇప్పుడు… మోడీ అధికారంలో ఉన్నారు. తన చేతకాని తనాన్ని అందరూ ప్రశ్నిస్తున్నారు కాబట్టే… అదంతా కాంగ్రెస్ తప్పే అనడానికి నిందలేస్తున్నారు. కానీ.. తన పనితనం.. ఆ మేరకు లేదని అంగీకరించలేకపోతున్నారు. ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే… మొన్నటికి మొన్న యూపీలో ప్రచారం చేస్తున్నప్పుడు… నెహ్రూ కుంభమేళా నిర్వహించలేకపోయారని… యోగి అద్భుతంగా నిర్వహించారని… సర్టిఫికెట్ జారీ చేసేశారు. నెహ్రూకు.. కుంభమేళా నిర్వహణకు సంబంధం ఏమిటో… ఎవరికీ అర్థం కాదు. కానీ మోడీ మాత్రం.. అలా.. ఆ కుటుంబాన్ని నిందిస్తూ.. చరిత్రను వక్రీకరిస్తూ రాజకీయం చేసుకుంటూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close