న‌రేష్ నిష్క్ర‌మ‌ణ తాత్కాలిక‌మా? శాశ్వ‌త‌మా?

మా అధ్య‌క్షుడు న‌రేష్ 40 రోజులు దీర్ఘ‌కాలిక సెల‌వులో వెళ్ల‌డం, ఆ స్థానంలో బెన‌ర్జీ తాత్కాలిక అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం తెలిసిన విష‌యాలే. అయితే న‌రేష్ నిష్క్ర‌మ‌ణ తాత్కాలిక‌మా? లేదంటే శాశ్వ‌త‌మా? అనే చ‌ర్చ మొద‌లైందిప్పుడు.

న‌రేష్ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు త‌ల‌కెత్తుకున్న‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ “మా“లో ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు, గంద‌ర‌గోళాలు, వివాదాలు. వీట‌న్నింటికీ కేంద్ర బిందువు న‌రేషే. ఏక ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ద‌గ్గ‌ర్నుంచి, మా నిధుల దుర్వినియోగం వ‌ర‌కూ ఆయ‌న‌పై ర‌క‌ర‌కాల అభియోగాలు. ఆమ‌ధ్య మా డైరీ ఆవిష్కర‌ణ స‌మ‌యంలో జ‌రిగిన గొడ‌వ తో ‘మా’ లుక‌లుక‌లు విశ్వ‌రూపం దాల్చాయి. వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి రాజ‌శేఖ‌ర్ రాజీనామా చేయ‌డం కూడా క‌ల‌క‌లం సృష్టించింది. అప్ప‌టి నుంచీ న‌రేష్ ని అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గిస్తార‌న్న ఊహాగానాలు వ్యాపించాయి. ‘నేను ఓటింగ్ ద్వారా గెలిచిన వ్య‌క్తిని. న‌న్నెవ్వ‌రూ నా స్థానం నుంచి త‌ప్పించ‌లేరు’ అంటూ న‌రేష్ కూడా ఆత్మ‌విశ్వాసం క‌న‌బ‌రిచారు. అయితే… ఎప్పుడైతే న‌రేష్ పై అభియోగాలు ఎక్కువ‌య్యాయో, అప్ప‌టి నుంచీ న‌రేష్ ని ఎలాగైనా స‌రే అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌న్న డిమాండ్లు ఎక్కువ‌గా వినిపించాయి. ఈ విష‌యంలో చిరంజీవి కూడా మీటింగులు పెట్టి, మాలో పెద్ద త‌ల‌కాయ‌లంద‌రికీ క్లాసులు పీకారు. ఇటీవ‌ల న‌రేష్ గురించి కొత్త కంప్లైంట్లు కూడా న‌మోద‌య్యాయ‌ని తెలిసింది. ఈసీ మెంబ‌ర్లు సైతం న‌రేష్ పై గుర్రుగా ఉన్నార‌ని, వాళ్లంతా క‌లిసి న‌రేష్ పై చ‌ర్య తీసుకోవాల్సిందే అని క్ర‌మ‌శిక్ష‌ణా సంఘానికి ఫిర్యాదు చేశార‌ని, అంద‌రూ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చి న‌రేష్‌ని త‌ప్పించాల‌నుకున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. స‌డ‌న్‌గా ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నా, రాజీనామా చేసినా.. త‌ప్పు ఒప్పుకున్న‌ట్టే అవుతుంద‌ని భావించిన నరేష్ త‌న బాధ్య‌త‌ల నుంచి తాత్కాలికంగా త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాల్సివ‌చ్చింద‌ని చెబుతున్నారు. న‌రేష్ ఇదివ‌ర‌కు కూడా షూటింగుల కోసం విదేశాల‌కు వెళ్లారు. అయితే అప్పుడు త‌న బాధ్య‌త‌లు వేరెవ‌రికీ అప్ప‌గించ‌లేదు. ఇప్పుడు మాత్రం ఆ అవ‌స‌రం ఎందుకు వ‌చ్చింద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. న‌రేష్ పై విచార‌ణ‌ జ‌రుగుతోంద‌ని, ఈ స‌మ‌యంలో ఆయ‌న అధ్య‌క్ష ప‌ద‌విలో ఉండ‌డం స‌రికాద‌నే… తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టార‌ని, న‌రేష్ సైతం ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చోవ‌డానికి ఇష్టప‌డ‌డం లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి,

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close