న‌రేష్ @ మ‌హేష్ రూమ్మెట్

మ‌హేష్ 25వ సినిమాలో అల్ల‌రి న‌రేష్ అన‌గానే.. ఆస‌క్తి మొద‌లైంది. ఓ హీరో సినిమాలో సైడ్ క్యారెక్ట‌ర్ చేయ‌డం న‌రేష్‌కి ఇదే తొలిసారి. దాంతో న‌రేష్‌కి ఎలాంటి పాత్ర ద‌క్కిందో, అదెలా ఉండ‌బోతోందో అనే చ‌ర్చ మొద‌లైంది. మ‌హేష్ – న‌రేష్ ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ములుగా క‌నిపిస్తార‌ని కొంద‌రు, బావా బామ్మ‌ర్థి అని కొంద‌రు చెప్పుకున్నారు. అయితే… ఇవేం కాద‌ని మ‌హేష్‌, న‌రేష్ ఇద్ద‌రూ రూమ్మెట్స్‌గా క‌నిపిస్తార‌ని స‌మాచారం. మ‌హేష్ ఎంబీఏ విద్యార్థిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. హాస్ట‌ల్లో మ‌హేష్ గ‌దిని పంచుకునే స్నేహితుడిగా న‌రేష్ క‌నిపిస్తాడ‌ట‌. అయితే ఈ పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంద‌ని, నరేష్ పాత్ర‌ ఫిల‌సాఫిక‌ల్ ట‌చ్‌తో సాగుతుంద‌ని తెలుస్తోంది. త్రీ ఈడియ‌ట్స్‌లో అమీర్‌ఖాన్ రూమ్మెట్ గా న‌టించిన మాధ‌వ‌న్ పాత్ర‌కు ఎంత‌టి ప్రాధాన్యం ఉంటుందో. ఈసినిమాలో న‌రేష్ పాత్ర‌కు అంత ప్రాధాన్యం ఉంటుంద‌ట‌. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి అశ్వ‌నీద‌త్‌, దిల్‌రాజు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌రు. 2019 సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close