న‌య‌న‌తార‌కు నెంబ‌ర్ వ‌చ్చింది!

మొన్న‌మొన్న‌టిదాకా కోలీవుడ్‌లో ఉన్న నెంబ‌ర్ క‌ల్చ‌ర్ ఈ మ‌ధ్య టాలీవుడ్‌కి కూడా పాకింది. హీరోల‌కే ప‌రిమిత‌మైన ఆ క‌ల్చ‌ర్ ఇప్పుడు హీరోయిన్ల‌కు కూడా వ‌ర్తిస్తోంది. ఇంత‌కీ ఆ క‌ల్చ‌ర్ ఏంటి? అని అనుకుంటున్నారా? నెంబ‌ర్ క‌ల్చ‌ర్‌. సినిమాకు టైటిల్స్ పెట్ట‌డానికి ముందు, ఆ సినిమా హీరో న‌టించే సినిమా సంఖ్య‌ను పేరు వెనుక జ‌త‌చేతి అల్లు అర్జున్ 19, మ‌హేష్ 25 అని అన‌డం అన్న‌మాట‌. త‌మిళనాడులో ఆ మ‌ధ్య సినిమాల‌కు పేర్లు పెట్ట‌డానికి ముందు నెంబ‌ర్ల‌తోనే పిల‌వ‌సాగారు. ట్విట్ట‌ర్ పుణ్య‌మా అని ఆ క‌ల్చ‌ర్ తెలుగుకు కూడా పాకింది. హీరోల‌ను బేస్ చేసుకుని మాత్రమే న‌డిచిన క‌ల్చ‌ర్ ఇప్పుడు హీరోయిన్ల‌కు కూడా వ‌ర్తిస్తోంది. అందులోనూ ఆ క్రెడిట్ తొలిసారి న‌య‌న‌తార‌కు వ‌చ్చింది. ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `ఐరా`. భ‌వానీ, య‌మున అనే రెండు పాత్ర‌ల్లో న‌య‌న‌తార న‌టిస్తోంది. ఈ సినిమా ఆమె న‌టిస్తోన్న 63వ సినిమా. సో ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ న‌య‌న్ 63 ఐరా అనే పిలుస్తున్నారు. ఐరా 63 అయితే, న‌య‌న్‌కు `సైరా` 64 అవుతుందేమో. ఐరా త‌ర్వాత సైరా.. బావుంది రైమింగ్‌.. క‌దా న‌య‌న్‌!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close