చిరుని కాద‌ని.. బాల‌య్య‌తో..??

చిరంజీవి 150వ సినిమాకి ఓ చిక్కుముడిగా మారింది న‌య‌న‌తార‌. చిరు ప‌క్క‌న క‌థానాయిక‌గా న‌టిస్తావా?? అంటే ముందు పారితోషికం పేరు చెప్పి బెంబేలెత్తించింది. ఆ త‌ర‌వాత కండీష‌న్లు పెట్టి క‌న్‌ప్యూజ‌న్ సృష్టించింది. ‘న‌య‌న వ‌ద్దులే..’ అని చిత్ర‌బృంద‌మే అనుకొనేలా తెలివిగా ప్లాన్ చేసింది న‌య‌న‌తార‌. ఇప్పుడు మాత్రం బాలకృష్ణ సినిమాకి అడ‌గ్గానే ఒప్పుకొని… టాలీవుడ్‌కి షాక్ ఇచ్చింది. ఔను.. బాల‌కృష్ణ న‌టించే 100వ చిత్రం గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంవ‌హించే ఈ చిత్రం మేలో ప‌ట్టాలెక్క‌బోతోంది. ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌య‌న‌తార‌ని ఎంచుకొన్న‌ట్టు స‌మాచారం. న‌య‌న కూడా అడ‌గ్గానే మ‌రో మాట‌కు తావులేకుండా ‘ఓకే’చెప్పేసింద‌ని టాక్‌.

బాల‌య్య‌తో న‌య‌న‌కు మంచి రాపో ఉంది. సింహా, శ్రీ‌రామ‌రాజ్యం చిత్రాల్లో ఇద్ద‌రూ జోడీ క‌ట్టారు. ఇప్పుడు త‌న వందో సినిమాలోనూ న‌య‌న అయితేనే బాగుంటుంద‌ని బాల‌య్య భావిస్తున్నార్ట‌. త‌నే న‌య‌న‌కు స్వ‌యంగా ఫోన్ చేసి, త‌న వందో సినిమా గురించి న‌య‌న‌తో డిస్క‌ర్స్ చేశార‌ని, దాంతో న‌య‌న కాద‌న‌లేక‌పోయింద‌ని టాలీవుడ్ టాక్‌. గౌత‌మి పుత్ర‌లో మ‌రో క‌థానాయిక‌కీ అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆ క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో తేలిపోతుంది. సో.. బాల‌య్య – న‌య‌న‌ల జోడీ మ‌రోసారి చూడ్డానికి రెడీ అయిపోండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com