న‌య‌న‌కు నాలుగు కోట్లా..??

చిరంజీవి 151వ చిత్రంలో క‌థానాయిక‌గా న‌య‌న‌తార దాదాపుగా ఖ‌రారైపోయింది. చిరు – న‌య‌న‌ల జోడీ ఎప్పుడో శంక‌ర్ దాదా టైమ్ లో నే చూడాల్సింది. ఎందుక‌నో కుద‌ర్లేదు. ఖైది నెం.150కి కూడా న‌య‌న పేరు ప‌రిశీలించారు. కానీ.. అప్పుడూ హ్యాండిచ్చింది. ఈసారి మాత్రం ఎలాంటి అడ్డూ చెప్ప‌కుండా `య‌స్‌` అనేసింద‌ట‌. దానికి కార‌ణం… ఆశ్చ‌ర్య‌ప‌రిచే పారితోషిక‌మే అని తెలిసింది. ఈ సినిమాకి గానూ.. న‌య‌న‌కు రూ.4 కోట్లు ముట్ట‌జెప్ప‌డానికి సిద్ధ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఆ పారితోషికం చూసే న‌య‌న మ‌రేమాత్రం ఆలస్యం చేయ‌కుండా ఈ సినిమాపై సంత‌కాలు చేసింద‌ట‌.

నిజానికి న‌య‌న పారితోషికం 2 కోట్లే. అంత ఇచ్చినా.. న‌య‌న ప్రచారానికి రాదు. ప‌బ్లిసిటీకి రావాలంటే అద‌నంగా ఎంతో కొంత ముట్ట‌జెప్పాల్సిందే. అందుకే ప‌బ్లిసిటీతో పాటు ప్ర‌చారం కోసం కూడా ముందుగానే.. పారితోషికం రూపంలో చెల్లించ‌డానికి చిత్ర‌బృందం సిద్ధ‌ప‌డింద‌ట‌. అంతేకాదు ఈ సినిమాకి గానూ 70 రోజుల కాల్షీట్లు అవ‌స‌ర‌మ‌య్యాయ‌ని తెలుస్తోంది. సాధార‌ణంగా ఇన్ని కాల్షీట్ల‌లో న‌య‌న రెండు సినిమాల్ని పూర్తి చేస్తుంది. ఆ కార‌ణంతోనే న‌య‌న పారితోషికం డ‌బుల్ చేసిన‌ట్టు స‌మాచారం. తెలుగుతో పాటు త‌మిళ ప్ర‌మోష‌న్ల‌లోనూ న‌య‌న‌తార‌ని వాడుకోవాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఈ కార‌ణాల‌తోనే ఒకేసారి పారితోషికాన్ని రూ.4 కోట్ల‌కు పెంచేశార్ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com