అమెజాన్‌లో వచ్చాక డబ్బింగా?

తెలుగు, తమిళ్‌, హిందీ అని తేడాల్లేవ్‌! ఇంగ్లిష్‌లో సబ్‌ టైటిల్స్‌ వుంటే చాలు… సినిమాలు చూసేస్తున్నారు. అందులోనూ సినిమా పోస్టర్‌ మీద అమెజాన్‌ బొమ్మ కనపడితే చాలు… నెల రోజుల్లో ఎంచక్కా దర్జాగా అమెజాన్‌లో సినిమా చూసుకోవచ్చని థియేటర్లకు వెళ్లడం మానేస్తున్న ప్రేక్షకులు కొంతమంది వున్నారు. ఇటువంటి సమయంలో ‘ఇమైక్కా నోడిగల్‌’ సినిమాను తెలుగులో ‘అంజలి విక్రమాదిత్య’గా డబ్బింగ్‌ చేస్తున్న నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అమెజాన్‌లో ఈ సినిమా వచ్చి నెల అవుతోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట హిట్టయ్యింది. తెలుగులోనూ క్రేజ్‌ ఉన్న నయనతార, రాశీ ఖన్నా నటించిన ఈ సినిమాలో హిందీ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ విలన్‌గా చేశారు. అందువల్ల, మెట్రో సిటీల్లోని ఆడియన్స్‌ చాలామంది సినిమా చూశారు. ఈ సినిమాకు టార్గెట్‌ ఆడియన్స్‌ కూడా వాళ్లే. తెలుగులో డబ్బింగ్‌ చేస్తున్నారని తెలియడం వల్ల చూసే ఆడియన్స్‌ కొంతమంది వుంటారు. ఈ నేపథ్యంలో తెలుగలో సినిమాకు ఆదరణ ఏమాత్రం దక్కుతుందనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close