అభిమానుల ఆయుధాలుగా మారిన సంక్రాంతి సినిమాలు.!

గత కొన్నిరోజులుగా ‘డిక్టేటర్‌’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాల రిలీజ్‌ విషయంలో బాలకృష్ణ, ఎన్టీఆర్‌ అభిమానుల మధ్య అగ్గి రాజుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌, సుకుమార్‌ల ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ప్రారంభమైన రోజునే ఈ చిత్రాన్ని జనవరి 8న రిలీజ్‌ చేస్తామని ఎనౌన్స్‌ చేశారు. బాలకృష్ణ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన ‘డిక్టేటర్‌’ చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. అయితే సంక్రాంతి దగ్గర పడే కొద్దీ రెండు సినిమాలు ఏయే డేట్స్‌కి రిలీజ్‌ అవుతాయన్న టెన్షన్‌ అభిమానుల్లో, ఇండస్ట్రీలో పెరిగిపోయింది. మొదట జనవరి 8కి రిలీజ్‌ చెయ్యాలనుకున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని జనవరి 13కి రిలీజ్‌ చెయ్యాలని నిర్మాత ఫిక్స్‌ అయ్యాడు. ‘డిక్టేటర్‌’ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. నిన్నటి వరకు ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం జనవరి 13కి రిలీజ్‌ అవుతుందా? లేక పోస్ట్‌పోన్‌ అవుతుందా అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే జనవరి 13నే సినిమాని రిలీజ్‌ చెయ్యబోతున్నట్టు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. నందమూరి వంశానికే చెందిన ఇద్దరు హీరోల మధ్య ఎలాంటి క్లాషెస్‌ వున్నాయి? ఒకరంటే ఒకరికి ఎందుకు పడడం లేదు అనే విషయానికి సంబంధించి ఎవరి దగ్గరా సరైన సమాచారం లేదు. ఈ విషయంలో హీరోలిద్దరూ నోరు మెదపకపోయినా వారి వారి అభిమానులు మాత్రం రెచ్చిపోతున్నారు. ఎన్టీఆర్‌ సినిమా రన్‌ అయ్యే థియేటర్‌ దగ్గర బాలకృష్ణ అభిమానులు ఎవరైనా కనిపిస్తే వారికి దేహశుద్ది తప్పదంటున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి పండగ సినిమాల రిలీజ్‌ విషయాన్ని అభిమానులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మార్కెట్‌పరంగా బాలకృష్ణ నైజాం ఏరియాలో చాలా వీక్‌. అలాగే సీడెడ్‌లో చాలా స్ట్రాంగ్‌. ఎన్టీఆర్‌ విషయానికి వస్తే ఎన్టీఆర్‌ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ మార్కెట్‌ బాగానే వుంది. ఎన్టీఆర్‌ మాత్రం పండగకి ఎన్ని సినిమాలు రిలీజ్‌ అయినా అన్నీ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నానని, ఈ విషయంలో తనకు ఎలాంటి టెన్షన్‌ లేదని చెప్తున్నాడు. సంక్రాంతి పండగ సీజన్‌లో రెండు మూడు సినిమాలు రిలీజ్‌ అయినా సూపర్‌హిట్‌ అయిన సందర్భాలు చాలా వున్నాయని ఎన్టీఆర్‌ నొక్కి మరీ చెప్తున్నాడు.

ఇదిలా వుంటే ఈ రెండు సినిమాల రిలీజ్‌ విషయంలో ఇప్పుడు రాజకీయాలు కూడా ఎంటర్‌ అయ్యాయనేది తాజా సమాచారం. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్‌ సినిమాకి థియేటర్లు దొరక్కుండా రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ రిలీజ్‌ అవుతున్న థియేటర్స్‌కి వెళ్ళి ఆ థియేటర్‌ యాజమాన్యాన్ని, ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్‌ని బెదిరిస్తున్నారన్న సమాచారం అందుతోంది. సంక్రాంతి పండగకు రిలీజ్‌ అయ్యే సినిమాలను సరదాగా ఎంజాయ్‌ చేద్దామనుకునే సాధారణ ప్రేక్షకులకు ఈ ఇద్దరు హీరోల అభిమానుల వల్ల ఎలాంటి ఎదురవుతాయోనని ఎగ్జిబిటర్లు టెన్షన్‌ పడుతున్నారట.

ఒకప్పుడు హీరోల అభిమానుల మధ్య సినిమా రిలీజ్‌ అయ్యే థియేటర్ల గురించి, తమ హీరో సినిమా కలెక్షన్ల గురించి, ఆ సినిమా సాధించిన రికార్డుల గురించి, ఎన్ని థియేటర్లలో 50 రోజులు, 100 రోజులు తమ సినిమా రన్‌ అయిందనే విషయాల్లో వాదోపవాదాలు జరిగేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. కేవలం తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని చెప్పుకునేందుకు, తమ ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు సినిమాలను ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నారు అభిమానులు. ఇలాంటి గొడవల వల్ల ఆయా హీరోలకుగానీ, అభిమానులకు గానీ ఒరిగేదేమీ లేదు. హీరోలిద్దరూ బాగానే వుంటారు. మధ్యలో నష్టపోయేది అభిమానులే అన్న విషయాన్ని బాలకృష్ణ, ఎన్టీఆర్‌ గ్రహించాలి. తమ తమ అభిమానుల్ని శాంతింపజేసి థియేటర్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇద్దరు హీరోల మీద వుంది. కానీ, ఈ విషయంలో వాళ్ళిద్దరికీ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారో, ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటారో వెయిట్‌ అండ్‌ సీ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close