బాల‌య్య సినిమా: క‌థ మారింది.. కానీ టీమ్ అదే!

ఎట్ట‌కేల‌కు నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా మొద‌లైంది. ఈరోజు ఎలాంటి హ‌డావుడి లేకుండా క్లాప్ కొట్టేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో, సి.క‌ల్యాణ్‌కి బాల‌య్య ఓసినిమా ఓచేస్తాన‌ని మాట ఇచ్చాడు. క‌థంతా రెడీ అయ్యాక‌.. ప‌రిస్థితులు మారిపోయాయి. ఏపీలో రాజ‌కీయం మారింది. అధికారం చేతులు మారింది. అప్ప‌టి ప‌రిస్థితుల్ని బ‌ట్టి అల్లుకున్న క‌థ‌… పక్క‌న పెట్టాల్సివ‌చ్చింది. ఈ త‌రుణంలో బాల‌య్య – కె.ఎస్.ర‌వికుమార్ సినిమా ఉంటుందా? లేదా? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే అప్ప‌టిక‌ప్పుడు ప‌రుచూరి ముర‌ళిని రంగంలోకి దింపి – కొత్త క‌థ రాయించారు. ఇప్పుడు ఆ క‌థే ఫైన‌ల్ అయ్యింది. కాంబో ఫిక్స‌య్యింది.

క‌థ మారినా బాల‌య్య టీమ్ మార‌లేదు. ఇది వ‌ర‌కు `రూల‌ర్‌`కి ఎవ‌రినైతే అనుకున్నారో, చివ‌రికి వాళ్లే ఫిక్స‌య్యారు. సాంకేతిక వ‌ర్గం మొత్తం అదే. `రూల‌ర్‌` సినిమా కోసం క‌థానాయిక‌లుగా ఎవ‌రి పేర్ల‌యితే ప‌రిశీలించారో, ఇప్పుడు వాళ్లే ఈ కొత్త సినిమాలోనూ ఫైన‌ల్ అవ్వ‌బోతున్నారు. `క్రాంతి` అనే మ‌రో పేరు అనుకుంటున్నా, బాల‌య్య కు మాత్రం `రూల‌ర్‌`పైనే మ‌క్కువ ఉంద‌ట‌. `రూల‌ర్‌` అనేది రాజ‌కీయాల‌కే ప‌రిమితం కాదని, క్యారెక్ట‌రైజేష‌న్‌ని బ‌ట్టి ఈ పేరు కూడా వాడొచ్చ‌ని చెబుతున్నాడ‌ట‌. కాక‌పోతే టైటిల్ ఇంకా ఫైన‌ల్ కాలేదు. వ‌చ్చే నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close