శివసేన, ఏజీపీ, అప్నాదళ్.. ! ఎన్డీఏకు లేనట్లే ..?

కొత్త మిత్రులను వెదుక్కని అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్న… బీజేపీ పెద్దలకు.. మిత్రపక్షాలను సముదాయించడం వల్ల కావడం లేదు. ఇప్పటికే… మిత్రపక్షాలన్నీ దూరయి.. దాదాపుగా ఒంటరిగా మిగిలిన ఎన్డీఏకు… మూడు రాష్ట్రాల్లో కీలక పార్టీలు.. హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్రలో శివసేన ఇప్పటికే కలు దువ్వింది. యూపీలో అప్నాదళ్… ఆత్మగౌరవ నినాదం అందుకుంది. అసోంలో అసోం గణపరిషత్.. నమస్కారం పెట్టేసింది. ఈ మూడింటిలో మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. శివసేన తోడ్పాటు లేకపోతే… మహారాష్ట్రలో ఈ సారి దారుణ పరాభవం ఎదురవుతుందన్న భావన ఉంది. హిందూత్వ ఎజెండాలో శివసేన దూకుడుగా ఉంది. బీజేపీపై విమర్శలు ఉన్నాయి. దీంతో… ఒకే భావజాలం ఉన్న పార్టీలు రెండు వేర్వేరుగా పోటీ చేస్తే.. ఎక్కువగా హిందూత్వ నినాదం వినిపిస్తే.. శివసేనకు అడ్వాంటే అవడం ఖాయంగా కనిపిస్తోంది.

శివసేన చాలా రోజుల నుంచి నరేంద్రమోడీని, అమిత్ షాను మాటలతో అత్యంత దారుణంగా అవమానిస్తోంది. రాహుల్ గాంధీని పొగుడుతోంది. కానీ పొత్తు లేకపోతే.. వచ్చే తిప్పలు తెలుసు కాబట్టి.. వారిద్దరూ నోరు మెదపడం లేదు. ఎంత చేసినా.. ఇప్పుడు సీట్ల సర్దుబాటుకు .. శివసేన అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ తమతో పొత్తు పెట్టుకోవాలంటే.. బీజేపీ మైనర్ పార్టనర్ కావాల్సిందేనని… శివసేన అంతర్గతంగా జరిగిన చర్చల్లో తేల్చి చెప్పేసింది. అరవై శాతానికిపైగా సీట్లను డిమాండ్ చేస్తోంది. అలా అరవై శాతం సీట్లు శివసేనకు వదిలేయడానికి బీజేపీ సిద్ధపడటం లేదు. అలా చేస్తే.. పార్టీని శివసేనకు అప్పగించినట్లవుతుందని అనుకుంటోంది. అందుకే ఒంటరి పోటీ ఎలా అని ఆలోచన ప్రారంంభించింది.

అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మిత్రపక్షం… అప్నాదళ్.. బీజేపీ అవమానిస్తోందని మండి పడుతోంది. కొన్నాళ్ల క్రితం.. అప్నాదళ్ ను కూటమిలో చేర్చుకుని ఆ పార్టీకి చెందిన అనుప్రియాపటేల్‌కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు నరేంద్రమోదీ. అయితే.. ఇప్పుడు యూపీలో పరిస్థితులు మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీ కలిస్తే… ఇతర పార్టీలకు సీట్లు వస్తాయో రావో అన్న పరిస్థితి ఏర్పడింది. అందుకే.. అప్నాదళ్ అగ్రనేతలు.. బీజేపీ తమను అవమానిస్తోందంటూ బయటపడుతున్నారు. నేడో రేపో గుడ్ బై చెప్పినా ఆశ్చర్యం లేదంటున్నారు. అలాగే అసోంలో పౌరసత్వ బిల్లు విషయం అసోం గణపరిషత్ బీజేపీపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి కూటమి నుంచి వైదొలిగింది. ఇతర పొరుగు దేశాల నుంచివ వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. దీన్ని ఖండిస్తూ.. ఏజీపీ బయటకు వచ్చేసింది. ఆ పార్టీ వెళ్లిపోవడం వల్ల.. అసోంలో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పు లేదు కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపించడం ఖాయమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close