ఏపీలో ఇక రంగా, అంబేద్కర్ విగ్రహాల రాజకీయం

నిన్న మొన్నటి దాకా గుళ్ళ పై దాడులు , రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల తో అట్టుడికిన ఆంధ్ర రాజకీయాల్లోకి ఇప్పుడు తాజాగా రంగా, అంబేద్కర్ విగ్రహాల పేరిట జరుగుతున్న రాజకీయం మీదకు వచ్చింది. వివరాల్లోకి వెళితే

రంగా ,అంబేద్కర్ విగ్రహం పై దాడులకు టిడిపి కుట్ర: వై ఎస్ ఆర్ సి పి

వైఎస్ఆర్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో రంగా, అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేయడానికి టిడిపి వ్యూహం పన్నింది అని తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. టిడిపి అంతర్గత సమావేశాల్లో ఈ మేరకు వ్యూహ రచన జరిగిందని, పార్టీ అంతర్గత వర్గాల నుండే తమకు సమాచారం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి అని ఆయన అన్నారు.

మరొక వైఎస్ఆర్ సీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ, రంగా అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేస్తే వాళ్ళ అభిమానులు రెచ్చిపోతారు. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే రాష్ట్రంలో అలజడి రేగుతుంది. దీనిని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి చంద్రబాబు వ్యూహం పన్నారు అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

ఆరోపణలను తిప్పికొట్టిన టిడిపి నేతలు:

అయితే వైఎస్ఆర్సిపి చేస్తున్న ఆరోపణలను టిడిపి నేతలు తిప్పికొట్టారు. టిడిపి నేత బోండా ఉమ మాట్లాడుతూ, వైఎస్ఆర్సిపి రహస్య అజెండా నే సజ్జల రామకృష్ణారెడ్డి బయటపెట్టారని అన్నారు. రంగా అంబేద్కర్ ల విగ్రహాలు వై ఎస్ ఆర్ సి పి యే ధ్వంసం చేయించి, ఆ నెపాన్ని టిడిపి మీదకు వేసి, తమ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వైకాపా ప్రయత్నిస్తోందని అన్నారు. ఒకవేళ నిజంగా రంగా, అంబేద్కర్ విగ్రహాల పై దాడులు జరిగితే వైఎస్ఆర్సిపి అంతు చూస్తామని హెచ్చరించారు.

మరొక టిడిపి నేత జ్యోతుల నెహ్రూ కూడా ఇదే విషయంపై స్పందించారు. అయితే ఆయన కాస్త విశ్లేషణాత్మకంగా, భిన్నంగా స్పందించారు. కాపులు ఆరాధ్య దైవంగా భావించే రంగా విగ్రహాన్ని, దళితులు ఆరాధ్య దైవంగా భావించే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆ నెపాన్ని టిడిపి మీదకు వేయడం ద్వారా ఆ రెండు వర్గాల ఓట్లను వైఎస్సార్ సిపి వైపు polarize అయ్యేలా చేసుకునే కుట్ర, వ్యూహం దీని వెనకాల ఉన్నాయని జ్యోతుల నెహ్రూ విశ్లేషించారు.

ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ఎత్తులు పై ఎత్తులతో హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close