పొదుపంటే “హిమాలయ” కాకుండా “కిన్లే” వాటర్ వాడటమే..?

మనసంతా నువ్వేలో ఓ సీన్ ఉంటుంది. సునీల్ కోసం ఓ ప్లేట్ నిండా ఇడ్లీలు పెట్టుకొస్తాడు వెయిటర్. అందరూ వింతగా చూస్తూ ఉంటారు. ఓ మనిషి అన్ని తింటారా.. అని. చుట్టుపక్కల వాళ్లు .. అలా చూస్తూండటంతో.. సునీల్ కాస్త తెలివిగా మాట్లాడతారు. వెయిటర్‌తో.. పెద్దగా..” మనిషనేవాడు ఇన్ని తింటాడా..” అని రెండు ఇడ్లీలు వెనక్కి ఇచ్చేస్తాడు.. ! అచ్చంగా ఏ మాత్రం తేడా లేకుండా.. ఇంతే వ్యవహరిస్తున్నారు… వైసీపీ నేత విజయసాయిరెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం అంత అట్టహాసంగా జరపడం… ప్రజల్లో చర్చనీయాంశమయితే.. దాన్ని అత్యంత నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంగా చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. రూ. 2 లక్షలే ఖర్చయ్యాయని చెప్పుకునేందుకు… అసలు విషయం చెప్పకుండా ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు.

ప్రమాణస్వీకార ఏర్పాట్ల అడ్వాన్స్ రూ. 29,10,000

జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం 30వ తేదీన ముగిసింది. ఆ రోజు సాయంత్రం చాలా జీవోలు విడుదల చేశారు. ఈ క్రమంలో.. RT-1177 నెంబర్‌తో ఓ జీఏడీ ఓ జీవో విడుదల చేసింది. అది జగన్ ప్రమాణస్వీకార ఏర్పాట్ల కోసం చెల్లించిన అడ్వాన్స్ కు సంబంధించినది. రూ. 29 లక్షల 10వేల రూపాయలు మంజూరు చేస్తూ దాన్ని విడుదల చేశారు. ఇది కేవలం.. జీఏడీకి సంబంధించిన కొన్ని ఏర్పాట్ల కోసం చెల్లించిన ఖర్చు. మిగతా శాఖలు.. ఇతర ఏర్పాట్ల ఖర్చులు చూస్తే… కనీసం రూ.రెండు కోట్లకు పైగానే ఖర్చయి ఉంటుందని ఎవరైనా అంచనా వేయగలరు. కానీ.. రూ. రెండు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి.. అత్యంత నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంగా… వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో విజయసాయిరెడ్డి రాటుదేలిపోయారు.

హిమాలయ వాటర్‌కు బదులుగా కిన్లే వాడటం పొదుపు చర్యనా..?

అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికీ ఎలాంటి బాధ్యత లేదని… విజయసాయిరెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వం… అప్పుల్లో ఉన్నప్పటికీ.. హిమాలయ మినరల్ వాటర్ వాడారని.. తమ ప్రభుత్వంలో ఇక ఆ వాటర్ కనిపించదని… అదే గొప్ప పొదుపు చర్య అన్నట్లుగా ట్వీట్ చేశారు. ఇప్పడు ప్రభుత్వం కిన్లే వాటర్ బాటిల్స్ మాత్రమే వాడుతుందనుకుంటా. జగన్ ప్రమాణస్వీకారం కానీ.. ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ కిన్లే వాటర్ బాటిల్స్ మాత్రమే వాడుతున్నట్లుగా ఉన్నారు. ఈ మార్పు వల్ల…. రాష్ట్ర ప్రభుత్వానికి… తమ పొదుపు చర్యల ద్వారా.. ఎంత పెద్ద మొత్తంలో మిగిలిస్తున్నారో కూడా.. విజయసాయిరెడ్డి వెల్లడించాల్సి ఉంది. కానీ అలాంటిదేమీ చేయలేదు.

ప్రభుత్వ పొదుపు ఖాతా నిధులు సాక్షికి ఎన్ని వెళ్లాయో చెప్పలగరా..?

నిజానికి కొత్త ప్రభుత్వానికి పొదుపై ఎంత ఆసక్తి ఉందో… జగన్ ప్రమాణస్వీకారం రోజున ఏర్పాట్లు మాత్రమే కాదు… పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు చూస్తేనే తెలిసిపోతుంది. ఐ అండ్ పీఆర్ ఇచ్చిన భారీ ప్రకటనలతో.. కొన్ని కోట్లు ఖర్చయిపోయి ఉంటాయి. అంత ఎందుకు… సర్క్యూలేషన్‌లో అగ్ర దినపత్రికకు.. సగానికి సగం మాత్రమే ఉండే సాక్షికి.. పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చారు. మామూలుగానే అందులో ఉండేది.. అవే వార్తలు. ప్రత్యేకంగా ప్రకటనలు ఇవ్వాల్సిన పని లేదు. నైతికత కూడా కాదు. ఎందుకంటే.. జగన్ పత్రికకు.. ప్రజల సొమ్ము దోచి పెడుతున్నారనే విమర్శలు వస్తాయి. అయినా ఏ మాత్రం.. ఆలోచించకుండా.. కోట్లకు కోట్లు ప్రకటనలు ద్వారా ఇచ్చేశారు. దీన్ని పొదుపుగా ఎలా చెప్పుకుంటారో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close