తెల్లాపూర్ లో మరో ఐటి నగరం

తెలంగాణాకి హైదరాబాద్ గుండెకాయ వంటిదని అందరూ అంగీకరిస్తారు. రాష్ట్ర రాజధాని అయినందున దానికి ఆ ప్రాధాన్యత ఉంటుంది. కానీ రాష్ట్రాన్ని దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా నిలుపుతున్నందున హైదరాబాద్ కి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అందుకు హైదరాబాద్ లో ఉన్న కామధేనువు వంటి ఐటి, సాఫ్ట్ వేర్ సంస్థలే మూలకారణమని చెప్పక తప్పదు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత హైదరాబాద్ కి మరిన్ని ఐటి, సాఫ్ట్ వేర్ సంస్థలను రప్పించేందుకు తెలంగాణా ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ఐటి పాలసీని కూడా ప్రకటించింది. తాజాగా మరొక మంచి ఆలోచన చేస్తోంది. హైదరాబాద్ శివార్లలో గల తెల్లాపూర్, నల్లగండ్ల ప్రాంతాలు రెంటినీ కలిపి ఒక ఐటి నగరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఆ ప్రాంతంలో ఐటి సంస్థల ఏర్పాటు చేయడంతో బాటు, వాటిలో పనిచేసే ఉద్యోగుల కోసం అక్కడే అత్యాధునిక నివాస సముదాయాలను కూడా నెలకొల్పడానికి కసరత్తు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయంలోనే దీని కోసం సుమారు 300 ఎకరాల భూమిని సేకరించారు. అందులో వివాద రహితంగా ఉన్న 100 ఎకరాలలో ముందుగా పనులు ప్రారంభించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఐసిఐసిఐ, నాగార్జున, టిస్మస్ సంస్థలు ఈ మెగా ప్రాజెక్టులో పాలుపంచుకొంటాయి. ఈ ప్రాజెక్టును మూడేళ్లలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వం తరపు నుండి అవసరమయిన సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇంతవరకు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే అందరికీ గుర్తు వస్తోంది. ఇప్పుడు తెల్లాపూర్ ని కూడా దానికి కలుపుకోవలసి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణా రాష్ట్రం ఆర్ధికంగా మరింత బలపడుతుంది. తద్వారా రాష్ట్రం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో కొన్ని ఐటి పరిశ్రమలు ఉన్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఐటి హబ్ గా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి అంతా కేవలం రాజధాని నిర్మాణంపైనే ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించినంత వేగంగా ఐటి రంగం అభివృద్ధి చెందడం లేదనే చెప్పాలి. ఇది హైదరాబాద్ ఐటి పరిశ్రమకి కలిసివచ్చే అంశం అవుతుంది. ఒకవేళ తెల్లాపూర్ ఐటి నగరం సిద్దమయితే ఇక హైదరాబాద్ స్థాయి ని అందుకోవడానికి ఏపీకి చాలా సమయం పట్టవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close