ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… దశలవారీగా మద్యనిషేధం విధిస్తామని ప్రకటించింది. కానీ.. బడ్జెట్‌లో మాత్రం.. ఎక్సైజ్ శాఖ నుంచి .. ఆదాయ అంచనాలను పెంచింది. ఈ రెండు పరస్పర విరుద్ధమే. అయితే.. ఈ అధికాదాయాన్ని ఎలా పొందుతారంటే… ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం ద్వారా పొందబోతున్నారు. ఇప్పటికే.. మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగిసింది. పొడిగింపునిచ్చారు. పొడిగింపు ముగిసిన తర్వాత ఇక టెండర్లు ఉండవు. నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరుస్తుంది.

మద్యం అమ్మబోతున్న ఏపీ సర్కార్.. !

గతంలో ఏపీ సర్కార్ ప్ర.సా.దు పేరుతో ప్రభుత్వ సారాయి దుకాణాలు నిర్వహించారు. ఇప్పుడు.. ప్ర.మ.దు పేరుతో నిర్వహిస్తారేమో కానీ.. కొత్త ఎక్సైజ్ విధానం కోసం అధికారులు ఇప్పటికే కొన్ని బ్లూప్రింట్స్ రెడీ చేశారు. ఇందు కోసం.. ఒక్కో షాప్‌కు నలుగురు చొప్పున కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించుకోవాలని నిర్ణయించారు. ఒక సూపర్ వైజర్, ముగ్గురు సేల్స్ మెన్లు ఉండేలా… ఈ ఏర్పాటు ఉంటుంది. మొత్తంగా కంప్యూటరైజ్ చేసి.. రోజువారీ అమ్మకాలు, స్టాక్స్ వివరాలు మొత్తం క్షణక్షణానికి అప్ డేట్ అయ్యేలా.. అవినీతికి తావు లేకుండా చేస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దీని వల్ల లైసెన్సింగ్ ఫీజు ప్రభుత్వానికి రాకపోయినా… అమ్మకాల్లో మార్జిన్ మొత్తం ప్రభుత్వం ఖాతాలోనే పడుతుంది. ఫలితంగా.. భారీగా ఆదాయం సమకూరుతుంది.

సా. ఆరు గంటల కల్లా లైన్లో ఉంటేనే అమ్మకం..!

మద్యం అమ్మే సమయాలను కూడా కుదించాలని భావిస్తున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే.. మద్యం అమ్మకాల చేపట్టాలనేది ప్రాధమికంగా నిర్ణయం. అయితే.. ఇది ఎంత వరకు సాధ్యమన్నదానిపై.. ప్రభుత్వ వర్గాలు ఇంకా పరిశీలన జరుపుతున్నాయి. ఇలా చేయడం వల్ల… మద్యం అమ్మకాలను నియంత్రిస్తున్నారనే భావన ప్రజల్లో వస్తుందని.. ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదేనని.. అధికారపార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలా చేస్తే .. సాయంత్రం ఆరు గంటలకల్లా.. లైన్లో నిలబడిన వారికి మద్యం అమ్ముతారా లాంటి అనే కొత్త డౌటనుమానాలు.. మందుబాబులకు చాలా వస్తాయి. వీటిపై ముందు ముందు క్లారిటీ రావాల్సి ఉంది.

వెల్లువెత్తే అక్రమ మద్యాన్ని ఎలా కట్టడి చేస్తారు..?

బెల్ట్ షాపులను రద్దు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అది ప్రభుత్వ దుకాణాల ద్వారా అయితేనే సాధ్యమని… నమ్ముతున్నారు. ప్రభుత్వ దుకాణాలకు అయితే.. టార్గెట్లు పెట్టుకోరు కాబట్టి.. తమ పరిధిలోని గ్రామాల్లో అమ్మబోరని అంటున్నారు. కానీ.. పరిస్థితి మరో రకంగా ఉండే అవకాశం ఉంది. అక్రమ మద్యం పెద్ద ఎత్తున గ్రామాలను.. ముంచెత్తడం ఖాయమనే అంచనా ఉంది. ప్రభుత్వానికి ఆదాయం రాదు కానీ.. అక్రమార్కులకు మాత్రం వరంగా మారుతుంది. పన్నులు కట్టని మద్యం.. ఏపీలో వెల్లువెత్తే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి మద్యం దుకాణాల యజమానులు.. తమ పరిధిలో ఇతరులు అక్రమ మద్యం అమ్మితే వెంటనే కనిపెడతారు. అలాంటివి చేయకుండా చూసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం పెట్టబోయే దుకాణాల్లో పని చేసేవారికి అలాంటి అవసరం లేదు. పైగా ప్రొత్సహించే అవకాశం ఉంది. ఇలా చాలా సమస్యలు.. ఉన్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వం ఏం చేస్తుందో మరి. సింపుల్‌గా చేయబోయే.. చినిగి చేటంత చేసుకుంటే… చెడ్డ పేరు ప్రభుత్వానికే వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

HOT NEWS

css.php
[X] Close
[X] Close