ఏప్రిల్ 1 నుంచి ఏ బ్యాంకిలో మీరు చేయిపెడితే ఎలా కరుస్తుందో….?

చార్జీల విధింపు తప్పా రైటా తర్వాతి విషయం.. బాదటం మాత్రం ఖాయమే అంటున్న బ్యాంకు మారాజులు.

మేం చేసే పని తప్పో ఒప్పో దాన్ని తేల్చాల్సింది మీరూ, మేమూ కాదు. చార్జీల బాదుడు మాత్రం ఖాయమే అంటున్నాయి మన దిగ్గజ బ్యాంకులు. దేశీయ బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖాతాదారుల పుట్టి ముంచడానికి బ్యాంకు దిగ్గజాలు సిద్ధమయ్యాయి. ఆ బాదుడు ముద్దుపేరు కస్టమర్లపై ఛార్జీలు. నిర్దేశించిన మొత్తం కంటే నగదు లావాదేవీలు జరిపితే, ఇక యూజర్లు తప్పసరిగా ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. నగదు లావాదేవీల తగ్గింపునకు కస్టమర్లకు ఈ వడ్డింపు వేస్తున్నట్టు బ్యాంకులు పేర్కొంటున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి మీరు ఏదైనా పనిమీద బ్యాంకుకు వెళ్లేముందు ఏ బ్యాంకిలో మీరు చేయిపెడితే ఎలా కరుస్తుందో, ఏ పని చేస్తే మీ దూల తీరుతుందో లేక తీరదో ఒకటికి రెండు సార్లు కింది అంశాలను సరిచూసుకుని మరీ వెళ్లండి. తెలిసి లేక తెలియక ఏ చిన్న పొరపాటు చేసినా, అజాగ్రత్తగా ఉన్నా చార్జీల పేరుతో మా ఖాతాలో డబ్బు కరిగిపోవటం ఖాయం.

బ్యాంకులు భారీగా విధించే సమీక్షించిన ఛార్జీల వివరాలేంటో మీరే ఓ సారి చూడండి….

1. ఏప్రిల్ 1 నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు నెలకు మూడు సార్లు మాత్రమే ఉచిత ఛార్జీతో నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే, ప్రతి లావాదేవీకి రూ.50కు మించి సర్వీసు ట్యాక్స్ చెల్లించాలి.

2. రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంతకు మించి నగదు డిపాజిట్‌ చేయాలనుకుంటే ప్రతీ రూ.1,000పై 75పైసల చార్జీ+సర్వీసు ట్యాక్స్ విధింపు ఉంటుంది.

3. ఏప్రిల్‌ 1 నుంచి కనీస బ్యాలన్స్‌ లేని ఖాతాలపై జరిమానా విధింపు. నెలవారీ కనీస నగదు నిల్వ నిర్వహణలో విఫలమైతే సేవింగ్స్‌ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీ తోపాటు సర్వీసు ట్యాక్స్ విధిస్తారు. కనిష్టంగా రూ.20+సర్వీసు ట్యాక్స్ ను బ్యాంకు నిర్ణయించింది.

4. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కనీస నగదు నిల్వ రూ.5000కు 75 శాతానికి పైగా తగ్గితే రూ.100 ప్లస్ సర్వీసు ట్యాక్స్ ఉంటుంది. ఒకవేళ 50 శాతం తగ్గితే, రూ.50 ప్లస్ సర్వీసు ట్యాక్స్ విధిస్తారు.

5. ఇతర బ్యాంకు ఏటీఎంలలో విత్ డ్రా లిమిట్ మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు చేస్తే రూ.20 ఛార్జీ వేస్తుంది. ఎస్బీఐ ఏటీఎంలలోనే ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు డ్రా చేస్తే రూ.10 ఛార్జీని బ్యాంకు విధించనుంది.

6. రూ.25వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండే సొంత ఏటీఎంలలో అయితే ఎలాంటి విత్ డ్రా ఛార్జీలుండవు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో డ్రా చేసుకునేందుకు ఛార్జీల మోత నుంచి తప్పించుకోవాలంటే బ్యాంకు బ్యాలెన్స్ రూ.లక్షకు మించి ఉండాలి.

7.ఓ త్రైమాసిక కాలంలో కనీస నగదు నిల్వలు రూ.25 వేలలోపు నిర్వహించే ఖాతాదారులకు వారి డెబిట్‌ కార్డు లావాదేవీలపై ఎస్‌ఎంఎస్‌ అలర్ట్స్‌కు గాను బ్యాంకు రూ.15 చార్జీలు వసూలు చేస్తుంది. పీఐయూఎస్‌ఎస్‌డీ లావాదేవీల విలువ రూ.1,000 వరకు ఉంటే ఆ సేవలు ఉచితం.

Mahesh Beeravelly

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close