నిహారిక‌.. మ‌జాకా?!

మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తోన్న తొలి హీరోయిన్‌… నిహారిక‌. ఒక్క సినిమా కూడా చేయ‌కుండా ఈ అమ్మ‌డిపై ఎన్ని న‌మ్మ‌కాలో..? ఇంకెన్ని ఆశ‌లో! నిజానికి నిహారిక వెండి తెర‌పై ఎంట్రీ ఇస్తోంద‌న‌గానే మెగా అభిమానులు కాస్త పెద‌వి విరిచారు. ‘అగ్ర న‌టుల కుటుంబాల నుంచి క‌థానాయిక‌లెవ‌రూ రాలేదు. నిహారిక రావాల్సిన అవ‌స‌రం ఏమిటి’ అన్న‌ట్టు మాట్లాడుకొన్నారు. అయితే ఢీ పోగ్రామ్‌లో నిహారిక యాంక‌రింగు చూసి కాస్త కూల్ అయ్యారు. నిహారిక‌లో హీరోయిన్ అయ్యే ల‌క్ష‌ణాలు చాలానే ఉన్నాయ‌ని వాళ్లూ గుర్తించారు. ఇప్పుడు మెగా అభిమానుల‌తో పాటు ఇండ్ర‌స్ట్రీ దృష్టి కూడా నిహారిక తొలి సినిమా ఒక మ‌న‌సుపై పెట్టారు.

మ‌ధుర శ్రీ‌ధ‌ర్, టీవీ 9 సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రామ‌రాజు ద‌ర్శ‌కుడు. షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమా బిజినెస్ కూడా బ్ర‌హ్మాండంగా జ‌రిగింద‌ని టాక్‌. ఇప్ప‌టికే చాలా ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయ్యింద‌ట‌. శాటిలైట్‌కీ ఫ్యాన్సీ ఆఫ‌ర్లు అందుతున్నాయ‌ని టాక్‌. మొత్తానికి ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ కావ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌బృందం న‌మ్మ‌కంగా చెబుతోంది. నిహారిక ఎఫెక్ట్ ఈ సినిమాపై ప‌డింద‌ని, అందుకే రిలీజ్ కాకుండానే సేఫ్ ప్రాజెక్టుగా మారిపోయింద‌ని, నిహారిక‌ది లక్కీ హ్యాండ‌ని యూనిట్ మొత్తం సంతోష‌ప‌డిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close