నిహారిక వార్త‌.. రూమ‌రే

ఒక మ‌న‌సుతో వెండి తెర‌పైకి వ‌చ్చింది నిహారిక కొణిదెల‌. ఆ సినిమాతో నిహారిక టాప్ హీరోయిన్ల‌కు చెక్ పెట్ట‌డం ఖాయం అనేంత రేంజులో మాట్లాడేసుకొన్నారంతా. కానీ.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో – అంచ‌నాల‌న్నీ త‌ల‌కిందులైపోయాయి. ఒక మ‌న‌సు టైమ్‌లో నిహారిక చుట్టూ తిరిగిన నిర్మాత‌లు, విడుద‌ల త‌ర‌వాత క‌నిపించ‌డం మానేశారు. దాంతో పాటు త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో తెలుసుకోవ‌డానికి నిహారిక‌కు సైతం టైమ్ ప‌ట్టింది. ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి పెడుతోంది. ఈమ‌ధ్య నిహారిక‌పై ఓ వార్త టాలీవుడ్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. నారా రోహిత్ – ప‌వ‌న్ సాదినేని కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంద‌ని, అందులో నిహారిక క‌థానాయిక అని వార్త‌లు వినిపించాయి. అయితే… ఈ న్యూస్ కేవ‌లం రూమ‌రేన‌ట‌. నిహారిక‌ని ప‌వ‌న్ సాదినేని క‌ల‌వ‌నే లేద‌ని, క‌థ కూడా విన‌లేద‌ని, అలాంట‌ప్పుడు ఈ కాంబో ఎలా సెట్ట‌యిన‌ట్ట‌ని నిహారిక పీఆర్ వ‌ర్గం చెబుతోంది. సో.. నారా రోహిత్ ప‌క్క‌న నిహారిక అనేది కేవ‌లం ఓ గాసిప్ మాత్ర‌మే! ఒక మ‌న‌సు త‌ర‌వాత నిహారిక మ‌రే తెలుగు సినిమాకీ సంతకం చేయ‌లేదు. రెండు మూడు అవ‌కాశాలు చేతిలో ఉన్నాయ‌ని, వాటిలో ఏది ముందు ప‌ట్టాలెక్కుతుందో తెలీద‌ని నిహారిక పీఆర్ చెబుతోంది. సో.. నిహారిక రెండో సినిమా కోసం ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.