నిఖిల్ మ‌రీ ఓవ‌ర్ చేస్తున్నాడ‌ట‌!

కెరీర్ మీద భ‌య‌మో, లేదంటే త‌మ‌పై తామ‌కు న‌మ్మ‌క‌మో తెలీదుగానీ, ఈ మ‌ధ్య కొంత‌మంది యువ హీరోలు `అంతా నేనే` అనుకొంటూ త‌మ సినిమాల‌కు సంబంధించిన ర‌క‌ర‌కాల విష‌యాల్లో తీవ్రంగా జోక్యం చేసుకొంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. నా సినిమాకు సంబంధించిన అన్నీ విష‌యాలూ నా క‌నుస‌న్న‌ల్లోనే జ‌ర‌గాలి.. అంటూ శాశిస్తున్నారు. ఆ లిస్టులో నిఖిల్ కూడా చేరిపోయాడ‌న్నది టాలీవుడ్ టాక్‌. ఇది వ‌ర‌కు కాస్త సైలెంట్‌గానే ఉండే నిఖిల్‌.. ఈమ‌ధ్య ప్ర‌తీ విష‌యంలోనూ క‌లుగ‌జేసుకొని ఓవ‌ర్ గా ఇన్‌వాల్వ్ అవుతున్నాడ‌ని అది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు తీవ్ర ఇబ్బందిని క‌లిగిస్తోంద‌న్న‌ది సినీ వ‌ర్గాల గుస‌గుస‌.

నిఖిల్ తాజా చిత్రం… ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా. ఈ సినిమాని అన్నీ తానై న‌డిపిస్తున్నాడ‌ట నిఖిల్‌. నిజానికి ఈనెల 11న ఈ చిత్రం రావాల్సివుంది. అయితే.. నిఖిల్ `ఆజ్ఞ‌` మేర‌కు 18కి వాయిదా ప‌డింది. ఇప్పుడు 18న కూడా రావ‌డం లేదు. ఈ వ‌రుస మార్పుల‌కు కార‌ణం.. నిఖిల్ వ్య‌వ‌హార‌మే అని తెలుస్తోంది. 18న ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈసినిమాని తీసుకొద్దామ‌ని నిర్మాత గ‌ట్టిగా చెబుతున్నా.. `18న రావ‌డానికి వీల్లేదు` అంటూ మొండికేస్తున్నాడ‌ట‌. ”18న న‌రేష్‌సినిమా విడుద‌ల అవుతోంది.. ఆ త‌ర‌వాత మ‌నం వ‌ద్దాం” అంటున్నాడ‌ట‌. న‌రేష్ సినిమా ఏమీ భారీగా రిలీజ్ అవ్వ‌డం లేదు. న‌రేష్ సినిమాకీ నిఖిల్ సినిమాకీ పోటీనే లేదు. అలాంట‌ప్పుడు న‌రేష్ సినిమాతో లింకేంట‌న్న‌ది నిర్మాత‌ల మాట‌. కానీ. నిఖిల్ వినిపించుకోవ‌డం లేదట‌. ప‌బ్లిసిటీ కూడా నిఖిల్ చెప్పిన చాన‌ల్‌లోనే జ‌ర‌గాల‌ని కండీష‌న్లు పెడుతున్నాడ‌ట‌. పోస్ట‌ర్ రిలీజ్ ద‌గ్గ‌ర్నుంచి ఆడియో రిలీజ్ వ‌రకూ అన్నీ తాను చెప్పినట్టుగానే జ‌ర‌గాల‌ని మొండికేస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిఖిల్ వ్య‌వ‌హారంతో చిత్ర‌బృందం బాగా విసిగిపోయింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. సినిమా హిట్ట‌యితే ఫ‌ర్వాలేదు. నిఖిల్ క‌ష్టానికీ, చిత్ర‌బృందం ప‌డుతున్న ఓర్పుకీ ఫ‌లితం వ‌స్తుంది. అదే తేడా కొడితే.. నిఖిల్‌ని ఆడిపోసుకోవ‌డం మొద‌లెట్టేస్తారు. ”హీరో ఇన్ వాల్వ్‌మెంట్ కొంత వ‌ర‌కూ బాగుంటుంది. ఓవ‌ర్ అయితే.. త‌ట్టుకోలేం” అంటూ.. ఈ చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు చాటుమాటుగా త‌మ గోడు వెల్ల‌బుచ్చుకొంటున్నార‌ట‌. ఏమిటో… నిఖిల్‌. ఇలాంటి విష‌యాల్లో కాస్త స్పీడు త‌గ్గించుకొంటే బాగుంటుంది క‌దా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close