అమరావతి చుట్టూ ఉపాధి అవకాశాలు పెంచే 9 నగరాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, మండలాలలోని 29 గ్రామల పరిధిలో 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడ ఏమి నిర్మించాలనేది ఈ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు.

చారిత్రకంగా నాగరికత వెలసిల్లిన ప్రాంతాలు, నగరాలు అన్నీ నది ఒడ్డునే ఉన్నాయి.అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలు నిర్మిస్తారు. అమరావతి లోపల చుట్టూ ఈ నవ నగరాలు ఓ మణిహారంలా ఉంటాయి.
సింగపూర్ ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి ఉచితంగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించి గత మే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉచితంగా అందజేసింది.

ప్రపంచ శ్రేణి నగరంగా అభివృద్ధి చేయడానికి అనువుగా దీనిని తయారు చేశారు. రాజధాని అంటే కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పరిశోధన, పర్యాటకం, ఆతిథ్యం, కళలు, సాంస్కృతిక, వాణిజ్య, సాంకేతిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా నిలవాలన్నది సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష. ఇవన్నీ వస్తే ఉపాధి అవకాశాలు వాటంతట అవే వస్తాయి.

విభజన నుంచీ రాష్ట్రం అనేక సవాళ్లను, ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటూనే వుంది. ఈ పరిస్ధితి వల్లే మరే రాష్ట్రానికీ లెని విధంగా ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మించుకునే అవకాశం కూడా మనకే వచ్చింది. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలను సందర్శించి, అక్కడి కట్టడాలను పరిశీలించారు.

దేశంలోని గాంధీనగర్, జైపూర్, నయారాయ్ పూర్, ఛండీగఢ్, అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి, ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా, బ్రెజిల్ లోని బ్రాసిలియా, మలేషియాలోని పుత్రజయ, కిజకిస్తాన్ రాజధాని ఆస్థానా వంటి నగరాలను సీఎం స్వయంగా సందర్శించారు. అక్కడి కట్టడాలను చూశారు. ఆయా నగరాల ప్లాన్లులను క్షుణ్ణంగా పరిశీలించారు.

వీటిలో కొన్ని వాటర్ ఫ్రంట్ నగరాలు, మరికొన్ని గ్రీన్ ఫీల్డ్ ప్లాన్డ్ నగరాలు ఉన్నాయి. ఆయా నగరాలలో కార్యకలాపాలను, ప్లాన్లను పరిశీలించిన తరువాత అమరావతి మహానగరంలో అంతర్భాగంగా 9 నగరాలుగా నిర్మించాలని నిర్ణయించారు. 1.ప్రభుత్వ పరిపాలన నగరం 2. న్యాయ నగరం 3. ఆర్థిక నగరం 4.విజ్ఞాన నగరం 5.ఎలక్ట్రానిక్స్ నగరం 6. ఆరోగ్య నగరం 7. ఆటల నగరం 8. మీడియా నగరం 9.పర్యాటక నగరం. దేశ,విదేశాలలో పలు నగరాలను చూసి, వాటి స్ఫూర్తితో ఈ విధంగా ప్రత్యేక నగరాలు నిర్మించాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. అంతేకాకుండా కట్టడాలన్నీ మన సంస్కృతి ప్రతిబింభించే విధంగా ఉండాలన్న అభిప్రాయంతో ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయా రంగాలకు సంబంధించిన అత్యంత ఆధునిక వసతులతోపాటు విద్య, వైద్యం, సాంకేతిక, రవాణా సౌకర్యాలన్నీ ఈ నగరాలలో అందుబాటులో ఉంటాయి. వివిధ అంశాలకు సంబంధించి 9 నగరాలు నిర్మించినప్పటికీ అన్ని నగరాలలో ప్రతీ ముఖ్యాశం అందుబాటులో వుంటుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు.

విశాలమైన రోడ్లు, వాటిలో సైకిల్ ట్రాక్ లు, పచ్చదనం పరిచినట్లు పచ్చికబయళ్లు, పూల మొక్కలు, చల్లదనాన్ని ఇచ్చే చెట్లు, ఫౌంటెన్లు…. ఇలా అందమైన ఓ సుందర నగరం ఏర్పడుతుంది. ఈ నగరాలను కలుపుతూ మెట్రో రైలు మార్గం నిర్మిస్తారు.

ప్రస్తుతానికి సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అందించినప్పటికీ, ఈ 9 నగరాలలో నిర్మించే భవనాలకు సంబంధించిన ప్లాన్లను ఆమోదించవలసి ఉంది. మలేషియాకు చెందిన నిర్మాణ సంస్థ ‘హ్యారిస్ గ్రూప్ కంపెనీల’ చైర్మన్ హ్యారిస్ గత నెలలో అమరావతి రాజధానిలో వివిధ భవనాల కోసం రూపొందించిన డిజైన్లను గత నెలలో సీఎం చంద్రబాబు నాయుడుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. వివిధ దేశాలలో పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన అనుభం ఉన్న ఈ సంస్థ రాజధానిలో నిర్మించే ట్విన్ టవర్స్ కు సంబంధించి పలు నమూనాలు చూపించింది.

ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, చరిత్ర, కళలు, బౌద్ధిజం.. మొదలైన అంశాలు ప్రతిబింబించేవిధంగా వాటిని రూపొందించారు. అయితే సీఎం వాటిని ఖరారు చేయలేదు. మరి కొందరు అంతర్జాతీయ ఆర్టిటెక్ట్ లు రూపొందించిన ప్లాన్లను కూడా చూసి, ఉత్తమమైన వాటిని ఎంపిక చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నారు. ప్లాన్లు ఖరారైన తరువాత, నగరాల నిర్మాణానికి ప్రభుత్వం ‘స్విస్ ఛాలెంజ్’ విధానంలో టెండర్లను పిలుస్తుంది. ఇప్పటికే రాజధానిలో కొన్ని రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. మరికొన్ని రోడ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నట్లు సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ చెప్పారు.

రోడ్ల నిర్మాణం జరిగి, భవనాల నిర్మాణం కూడా మొదలైతే ఈ ప్రాంతంలోని స్థలాలకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చి, ఫ్లాట్లు పొందిన రైతులు లాభపడే అవకాశం ఉంది. ఇదంతా జరగడానికి రెండు మూడేళ్ల సమయం పడుతుందని జైన్ అభిప్రాయపడ్డారు.

విజయవాడ, గుంటూరుల నుంచే కాకుండా రాయలసీమ,ఉత్తరాంధ్ర నుంచి కూడా అమరావతికి అనుసంధానం చేస్తూ ఆరు లైన్ల రోడ్లు నిర్మిస్తారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్, జపాన్, చైనా, రష్యా, యునైటెడ్ కింగ్ డమ్ తదితర దేశాలతోనూ, అంతర్జాతీయ వ్యాపార సంస్థలతోనూ వాణిజ్యం, పెట్టుబడులు, ఉమ్మడి సంస్థలు, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలు, స్మార్ట్ నగరాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, విద్య, వైద్యం, పర్యావరణం, రవాణా వ్యవస్థలు, సామాజిక సంక్షేమం మొదలైన రంగాలలో పరస్పర సహకారం కొరకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఇంకా చేసుకుంటూనే ఉంది.

ఈ 9 నగరాల నిర్మాణం పూర్తి అయితే అమరావతి ప్రపంచంలోనే ఒక మోడల్ మహానగరం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close