‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’ టీజ‌ర్‌: సందీప్ కిష‌న్‌లో వెన్నెల కిషోర్‌

హార‌ర్ థ్రిల్ల‌ర్ సినిమాల‌పై మ‌న‌వాళ్ల‌కు మ‌క్కువ పోలేదు. అందుకే ఆత్మ క‌థ‌లు వెల్లువ‌లా వ‌స్తూనే ఉన్నాయి. దెయ్యం క‌థ‌ల్లోనే ఓ కొత్త కోణం చూపించే సినిమాలు మాత్రం నిల‌బ‌డుతున్నాయి. ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ కూడా ఓ హార‌ర్ సినిమాని ఎంచుకున్నాడు. అదే.. `నిను వీడ‌ని నీడ‌ని నేనే`. కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. టైటిల్‌ని బ‌ట్టి ఇదో దెయ్యం క‌థ అని అర్థ‌మైపోతోంది. టీజ‌ర్లో కూడా హార‌ర్ ఎలిమెంట్స్ బాగానే క‌నిపిస్తున్నాయి. త‌మ‌న్ లాంటి సంగీత ద‌ర్శ‌కుడు ఈ టీమ్‌లో ఉండ‌డం బాగా క‌లిసొచ్చింది. త‌మ‌న్ ఆర్‌.ఆర్‌తో.. హ‌డ‌లెత్తించాడు. సందీప్ కిష‌న్‌లో.. వెన్నెల కిషోర్ ఆత్మ ఉంద‌న్న విష‌యం చూచాయిగా చెప్పేశారు. వెన్నెల కిషోర్ ఆత్మ సందీప్ లోకి ఎందుకు వెళ్లింది? ఆ ఆత్మ ఏం చేసింది? అనేదే ఈ సినిమా క‌థ‌. గ‌త కొన్నాళ్లుగా సందీప్ కిష‌న్‌కి విజ‌యాల్లేవు. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్టే వెళ్లిపోతోంది. ఈ ద‌శ‌లో హీరోగా నిల‌దొక్కుకోవాల‌న్నా, ఇండ్ర‌స్ట్రీలో మ‌రో అవ‌కాశం సంపాదించాల‌న్నా.. ఈ సినిమాతో హిట్టు కొట్ట‌డం అత్య‌వ‌స‌రం. మ‌రి ఆత్మ క‌థ‌.. సందీప్ కోరిక తీరుస్తుందో లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.