అఫీషియ‌ల్‌: నితిన్ తో ర‌మేష్ వ‌ర్మ‌

ర‌మేష్ వ‌ర్మ కెరీర్‌కి మ‌ళ్లీ జోష్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా చేస్తున్న ర‌మేష్ వ‌ర్మ‌… ఇప్పుడు నితిన్ సినిమాని సెట్ చేసుకున్నాడు. నితిన్ – ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంది. ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే త‌ర‌హాలో వైవిధ్యంగా సాగే ప్రేమ క‌థ ఇది. ఆగ‌స్టు నుంచి చిత్రీక‌ర‌ణ మొద‌ల‌వుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. కోనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రానికి నిర్మాత‌. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో చేస్తున్న `రాక్ష‌స‌న్‌` రీమేక్ శ‌ర‌వేగంగా పూర్త‌వుతుంది. జులై – ఆగ‌స్టుల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఆ త‌ర‌వాతే.. నితిన్ సినిమా మొద‌ల‌వుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com