నితిన్ స్క్రిప్టు… రాజ్ త‌రుణ్ ద‌గ్గ‌ర‌కు

గుండె జారి గ‌ల్లంత‌య్యిందే సినిమాతో ఆక‌ట్టుకున్నాడు విజ‌య్‌కుమార్ కొండా. ఆ సినిమా హిట్టుతో త‌న‌కి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. ఒక‌లైలా కోసం ఫ్లాప్ అవ్వ‌డంతో.. ఒక్క‌సారిగా క‌నుమ‌రుగైపోయాడు. తొలి సినిమాతో వ‌చ్చిన క్రేజ్ మొత్తం రెండో సినిమాకే మాయ‌మైంది. మ‌రో క‌థ త‌యారు చేసుకుని కొన్నాళ్లు నితిన్ చుట్టూ తిరిగాడు. నితిన్ ఈ క‌థ‌ని ఓకే చేసినా… ప‌ట్టాలెక్కించ‌డంలో మీన‌మేశాలు లెక్కెడుతున్నాడు. దాంతో ఈ క‌థ ప‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు విజ‌య్ కుమార్‌. ఇప్పుడు ఆ క‌థ‌ని రాజ్ త‌రుణ్‌తో తీయ‌బోతున్నాడ‌ట‌. ఈ కాంబినేష‌న్‌లో సినిమా దాదాపు ఫిక్స‌యిపోయిన‌ట్టే. హీరోయిన్‌, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో బ‌య‌ట‌కు వ‌స్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com