శ్రీనివాస కళ్యాణం మొదలైంది

”పెళ్ళి అనేది కేవలం ఓ కార్యక్రమం కాదు. అందమైన జ్ఞాపకం” అంటోంది ‘శ్రీనివాస కళ్యాణం’ యూనిట్! నితిన్ హీరోగా… రాశీ ఖన్నా, నందితా శ్వేతా హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. ప్రతి జంట జీవితంలో అందమైన జ్ఞాపకంగా నిలవాల్సిన కళ్యాణం ఎంత మధురంగా ఉండాలో చెప్పడం కోసం వెండితెరపై ఆవిష్కరించడానికి యూనిట్ సభ్యులు అందరూ సిద్ధమయ్యారు. ఆదివారం ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ‘శతమానం భవతి’ తర్వాత సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రమిది. ‘శతమానం భవతి’కి సంగీతం అందించిన మిక్కీ జే మేయర్ ఈ సినిమాకీ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ మొదలైన సందర్భంగా విడుదల చేసిన టైటిల్ లోగో పోస్టర్ ను పెళ్ళి కళ ఉట్టిపడేలా డిజైన్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

తీహార్ తెలంగాణ కాదు..!!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను...

ప్రజల కామన్‌సెన్స్‌కు పరీక్ష పెడుతున్న జగన్ !

వివేకా హత్య కేసు దగ్గర నుంచి తన పరిపాలనా ఘనతల వరకూ ... ప్రతీ అంశంలోనూ సీఎం జగన్ చెబుతున్న విషయాలు.. చెప్పుకున్నంటున్న అంశాలు.. క్రెడిట్ తీసుకుంటున్న వ్యవహారాలు చూస్తే.. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close