100డేస్ ఆఫ్ లవ్…నిత్యామీనన్ స్పెషల్

అలా మొదలైంది సినిమాతో దూసుకొచ్చిన బెంగుళూరు నటి నిత్యామీనన్ రెగ్యులర్ హీరోయన్స్‌తో పోలిస్తే సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుంది. మాస్ కమ్యూనికేషన్స్ చదివిన నిత్యాకు స్పెసిఫిక్ ఆలోచనలు ఉన్నాయి. కేవలం డబ్బు కోసమే సినిమాలు చేసే టైప్ అయితే అస్సలు కాదు. తను సెలక్ట్ చేసుకునే సినిమాల్లో కూడా ఎంతో కొంత విషయం ఉంటుంది. అందుకే తనతో వర్క్ చేసిన హీరోలు, డైరెక్టర్స్ కూడా నిత్యామీనన్‌కి మా కథ చాలా నచ్చిందని స్పెషల్‌గా చెప్పుకుంటారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఒకె బంగారం, గుండెజారి గల్లంతయ్యిందే, ఒక్క అమ్మాయి తప్ప…ఇలా నిత్యా నటించిన సినిమాలలో ఎక్కువ భాగం కథాబలమున్న సినిమాలే. అలాగే బెంగుళూర్ డేస్ లాంటి మంచి సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్‌లో కనిపించడానికి కూడా వెనుకాడలేదు నిత్య.

ఈ రోజు రిలీజ్ అయిన 100డేస్ ఆఫ్ లవ్ సినిమా కూడా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఒకె బంగారం స్టైల్‌లోనే ఉంది. సింపుల్ లవ్ స్టోరీనే కానీ తన సినిమా ఓ పెయింటింగ్‌లా ఉండాలన్న డైరెక్టర్ తపన మాత్రం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించింది. అలాగే హీరో దుల్కర్ సల్మాన్‌తో పాటు నిత్యా నటన కూడా బాగుంది. అన్నింటికీ మించి సినిమాలో కామెడీని ఇంక్లూడ్ చేసిన విధానం మాత్రం ప్రేక్షకులకు నచ్చింది. అందుకే ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి 100 డేస్ ఆఫ్ లవ్ సినిమాకి మంచి టాక్ వస్తోంది. కొంచెం స్లోగా ఉందన్న మైనస్ పాయింట్ పక్కన పెడితే మంచి సినిమా అనే చెప్తున్నారు. కథల సెలక్షన్‌లో తన టేస్ట్ చాలా బాగుంటుందని మరోసారి ప్రూవ్ చేసుకుంది నిత్య.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close