గుజరాత్ నుంచి మరో “హిందూస్థాన్ లీవర్” ..! ఆయన లెక్క రూ. 5,700 కోట్లు..!!

బ్యాంకులకు వేల కోట్లు పంగనామాలు పెట్టి.. విదేశాలకు పరారవుతున్న పెద్దల జాబితాలో.. మరో గుజరాతీ బడా వ్యాపార వేత్త చేశారు. ఆయన గుజరాతీ మాత్రమే కాదు.. బీజేపీలోని పెద్దలందరికీ అత్యంత సన్నిహితుడు. బ్యాంకలుకు దాదాపుగా రూ. 5,700 కోట్లు రుణాల రూపంలో తీసుకుని చెల్లించకుండా.. జెండా ఎత్తేశాడు. చాలా మందుగానే ప్రణాళికలు వేసుకున్నట్లు ఉన్నాడు.. నేరుగా ఆఫ్రికా దేశం నైజీరియా వెళ్లిపోయాడు. అక్కడైతే కోర్టులు..కేసులు.. చింతలు కూడా ఉండని కావొచ్చు. గుజరాత్‌ ఫార్మా రంగంలో పేరెన్నికగన్న నితిన్‌ సందేసర అనే పారిశ్రామికవేత్త బ్యాంకుల దగ్గర .. దాదాపుగా రూ. 5,700 కోట్లు అప్పులు చేశారు. అవన్నీ మొండి బకాయిలుగా మారిపోయాయి.

నితిన్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ గ్రూప్‌ ప్రమోటర్లు నకిలీ, తప్పుడు డాక్యుమెంట్లతో పలు బ్యాంకుల నుంచి ఈరుణాలు తీసుకున్నారు. అసలు కాదు కదా.. వడ్డీ కూడా కట్టడం లేదు. ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని మనీలాండరింగ్ ద్వారా.. దారి మళ్లించాడు. చాలా వరకు.. విదేశాలకు తరలించేశాడు. ఇలా రుణాలు తీసుకోవడం.. అక్రమంగా తరలించడంపై.. ఫిర్యాదులు రావడంతో.. ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. నితిన్‌ను గతనెలలో దుబాయ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారని ప్రచారం జరిగింది కానీ.. మధ్యలో ఏమయిందో… ఏమో.. ఆయన నైజిరియాకు పారిపోయినట్లు ప్రస్తుతం… కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, ఎస్‌బీఐ, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ వంటి బ్యాంకుల కన్సార్షియం నితిన్‌కు రుణాలను మంజూరు చేసింది.

బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితుడైన ఈ వ్యాపారవేత్త… ముందుగానే చాలా మంచి ప్రణాళికతో ఉన్నట్లు ఉన్నారు. కుటుంబ సభ్యులందర్నీ.. చాలా మందుగానే నైజీరియాకు తరలించారు. ఇప్పుడు ఈ నితిన్‌ను తీసుకు రావడం… కేంద్ర ప్రభుత్వం వల్ల కాదు. మాల్యా, మోడీ, చోక్సీల్లా… వదిలేయాల్సిందే. బహుశా.. కేంద్రం ఉద్దేశం కూడా అదే అయి ఉండవచ్చనే విమర్శలు సహంజంగానే వస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close