ప్రొ.నాగేశ్వర్: అవిశ్వాసంపై విపక్షాల వ్యూహం ఏమిటి..?

పార్లమెంట్లో ఒక్క భారతీయ జనతా పార్టీకే 273 సీట్లు ఉన్నాయి. మిత్రపక్షాలతో కలుపుకుంటే… ఎన్డీఏకు 310 మంది సభ్యుల మద్దతు ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గడం అంత సులభం కాదు. ప్రభుత్వం పడిపోనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు అని కొంత మంది ప్రశ్నిస్తూ ఉంటారు. పార్లమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం… అవిశ్వాస తీర్మానం కేవలం ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కూడా అవిశ్వాస తీర్మానం ఓ ఆయుధం. ప్రస్తుతం ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టడానికి అలాంటి కారణాలే ఉన్నాయి.

ఏ పార్టీ ఎవరి వైపు తేలబోతోంది..!

2019 ఎన్నికలకు ముందు ఎవరి బలాలేమిటో తెలుస్తాయి. వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామం లాంటిది కనుక ఎవరు ఎటు వైపు ఉన్నారో తేల్చుకునేందుకు అవిశ్వాసం కీలకం కానుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలేవి..? బీజేపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్న పార్టీలేవి..?బీజేపీతో అంటకాగుతున్న పార్టీలేవి..? అన్నవి తేట తెల్లం అవడం వల్ల తమ రాజకీయ వ్యూహాలు మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు ఉంటాయి. ఓ పార్టీ విమర్శిస్తూ ఉంటుంది. కానీ పరీక్ష పరిస్థితులు వచ్చే సరికి అనుకూలంగా మారుతుంది. కష్టం వచ్చినప్పుడే ఎవరు మిత్రుడో తెలిసేది. అలాంటి పరిస్థితిని తేల్చడమే ఈ అవిశ్వాస లక్ష్యం. ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలేవి..? వ్యతిరేకించే పార్టీలేవీ అన్నదాన్ని అవిశ్వాసం తేల్చేస్తుంది.

ప్రాంతీయ పార్టీల నాయకుడెవరో క్లారిటీ ఇచ్చే చాన్స్..!

కాంగ్రెస్ పార్టీ.. ఇతర ప్రాంతీయ పార్టీలు ఐక్యంగా బీజేపీని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీహార్ లో మహాకూటమి ఉంది. కాంగ్రెస్, ఆర్జేడీ కలసి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే కూటమి కట్టారు. ఉపఎన్నికల్లో కలసి పోటీ చేశారు. మహారాష్ట్ర ఉపఎన్నికల్లో కాంగ్రెస్ , ఎన్సీపీ కలసి పోటీ చేశాయి. దేశవ్యాప్తంా పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహాకూటమి ప్రతిపాదన వస్తోంది. అయితే ఈ ప్రతిపక్షాల ఐక్యత అనేది అనేక రకాల సందేహాలకు కారణం అవుతోంది. ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే.. కూటమికి ఎవరు నాయకుడు అనేది. సహజంగా సంకీర్ణ రాజకీయాల్లో ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీ నేత నాయకత్వం వహిస్తారు. ఎన్డీఏలో మోడీ, యూపీఏలో రాహుల్ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కూటమిలో నాయకుడు ఎవరన్నదే ప్రదాన ప్రశ్న.2019 తర్వాత ఈ ప్రశ్నకు ఆన్సర్ దొరుకుంది. కానీ మహాకూటమిని ప్రశ్నార్థకం చేయడానికి బీజేపీ పదే పదే మీ నాయకుడెవరన్న ప్రశ్నను తీసుకొస్తోంది.

కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుందా..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు. 2019కి ముందు అంగీకరించే అవకాశం కూడా లేదు. కారణమేమిటంటే.. ఆయా రాష్ట్రాల్లో నష్టం జరుగుతుందని.. పార్టీలు భావిస్తున్నాయి. బెంగాల్ లో కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితుల్లో లేదు. అందుకే కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధపడే అవకాశం లేదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు ఉన్నాయి.అంటే.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నాయకత్వాన్ని మిత్రులు అంగీకిరంచే పరిస్థితి లేదు. అలాగే ప్రాంతీయ పార్టీల్లోనూ కొన్ని భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ లాంటి పార్టీ..కాంగ్రెసేతర, బీజేపీయేత కూటమి అంటారు. కానీ బీజేపీతో సన్నిహితంగా ఉంటారు. ఇలాంటి వాటన్నింటికీ.. ఓ పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలి అంటే.. అవిశ్వాస తీర్మానం కీలకం. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసును స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నప్పుడు.. అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ మాది కాబట్టి.. తామిచ్చిన నోటీసును పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కోరారు. తమ నాయకత్వంలోనే ఏదైనా జరగాలని కాంగ్రెస్ కోరుకుంది. అయితే స్పీకర్ మొదట ఎవరు నోటీసు ఇస్తే వారిదే పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం..!

అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాల వ్యూహం ఏమిటంటే.. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎక్స్ పోజ్ చేయడం. నల్లధనం వెనక్కి తేవడం దగ్గర్నుంచి నోట్ల రద్దు, జీఎస్టీ వరకు అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ ఘోర వైఫల్యాలు ఉన్నాయి. రూపాయి చరిత్రలో లేనంత దారుణంగా పడిపోయింది. యూపీఏ హయాంలో తలకిందలయ్యే పరిస్థితి ఎలా ఉందో.. ఇప్పుడు అలానే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కశ్మీర్ లో హింసాకాండ పెరిగింది. రాఫెల్ లాంటి కుంభకోణాలు బయటపెట్టాయి. కాంగ్రెస్ హయాంలో అనే స్కాంలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై ప్రచారం చేసుకుని మోడీ అధికారంలోకి వచ్చారు. ఒక్క కేసులోనూ ఎవరికీ శిక్ష పడలేదు. ఇవే కాక.. రాష్ట్రాల్లో ఉండే సమస్యలు ఉన్నాయి. వీటన్నింటి విషయంలో ప్రభుత్వాన్ని ఎక్స్ పోజ్ చేయవచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ లాంటి పార్టీలు.. రాజకీయ వైఖరిని బయటపెట్టడం లేదు. ఈ అవిశ్వాసంతో మూడు పార్టీల వ్యవహారం తేలిపోయే అవాకాశం ఉంది. ఓటింగ్ ను బహిష్కరిస్తామని టీఆర్ఎస్ చెబుతోంది కానీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పడం లేదు. ఇప్పటి వరకూ బీజేపీకి రహస్యంగా సహకిరిస్తున్న వారి విషయం బయపడిపోతుంది. బీజేడీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకేలకు ఇప్పుడు శీలపరక్ష లాంటిది. ఈ శీలపరీక్ష నుంచి వైసీపీ తప్పించుకుంది. ఎంపీలు రాజీనామాలు చేసి సభలో లేకుండా పోయారు.

ఎన్డీఏలో మిత్రపక్షాలు దారికొస్తాయా..?

ఇక ఎన్డీఏలో ఉన్న పార్టీల సంగతి కూడా తేలిపోనుంది. శివసేన 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయబోమని చెబుతోంది. జేడీయూ సంగతి తేలడం లేదు. వీరు కూడా ఇప్పుడు తమ వైఖరి తెలియజేయక తప్పని సరి పరిస్థితి. ఈ రాజకీయ వ్యూహాలను అన్నింటిని దృష్టి పెట్టుకుని విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి తప్ప.. ప్రభుత్వం పడిపోవాలని మాత్రం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close