సెహ్వాగ్‌కి, పియర్స్ మోర్గాన్‌కి తేడా ఏముంది?

……..‘120కోట్ల జనాభా ఉన్నదేశంలో రెండు పతకాలు సాధిస్తేనే పిచ్చిగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది చాలా చిరాగ్గా అనిపిస్తోంది……’

పియర్స్ మోర్గాన్ అనే అథమ స్థాయి పాత్రికేయుడు ఇండియాని ఉద్ధేశ్యించి చేసిన కామెంట్.

…………‘మేం చిన్న చిన్న ఆనందాలను కూడా వేడుకగా జరుపుకుంటాం. కానీ క్రిెకెట్‌కి పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ ఇప్పటి వరకూ వరల్డ్ కప్ గెలవలేదు. అయినా వరల్డ్ కప్ ఆడుతూ ఉండడం మాకూ చిరాగ్గానే అనిపిస్తోంది……..’

వీరేంద్ర సెహ్వాగ్ అనే————–ఇండియన్ క్రికెటర్ ఇంగ్లాండ్‌ని ఉద్ధేశ్యించి చేసిన కామెంట్.

ఇండియన్ మీడియా, కొంతమంది జనాలు సెహ్వాగ్‌ని బీభత్సంగా పొగిడేశారు. కానీ ఎవ్వరూ ఉన్నతంగా ఆలోచించలేకపోయారు. ఇండియాను అవమానించేలా చెత్త కామెంట్స్ చేసింది మోర్గాన్ ఒక్కడే. మోర్గాన్‌ని విమర్శించడం, తిట్టడాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ మోర్గాన్ ఎలాంటి చెత్త కామెంట్స్ చేసి ఇండియన్స్‌ని బాధపెట్టాడో, అవే చెత్త కామెంట్స్ ఇంగ్లాండ్ గురించి కూడా చేసి ఆ దేశ పౌరులను బాధ పెట్టాలనుకోవడం దారుణం. ఆవేశంగా ఆలోచిస్తే సెహ్వాగ్ భలే కౌంటర్ వేశాడ్రా అనిపిస్తుంది. కానీ సెహ్వాగ్ కూడా మోర్గాన్ చేసిన పనే చేశాడన్నది మాత్రం వాస్తవం. దీన్ని దెబ్బకు దెబ్బ, కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని అనుకోవడానికి కూడా లేదు. ఇండియన్స్‌ని దెబ్బ కొట్టింది మోర్గాన్ అయితే సెహ్వాగ్ మాత్రం ఇంగ్లాండ్‌ పౌరులను దెబ్బకొట్టాడు. వాళ్ళలో మోర్గాన్ కూడా ఒకడైతే కావచ్చు. కానీ ఇంగ్లాండ్ పౌరులందరూ ఇండియా గురించి నెగిటివ్‌గా కామెంట్ చేయలేదుగా. కనీసం ఇంగ్లాండ్ గవర్నమెంట్‌కి కూడా మోర్గాన్ స్టేట్‌మెంట్స్‌తో సంబంధం లేదు.

సెహ్వాగ్ స్టేట్‌మెంట్స్‌తో ఇండియాలో ఉన్నవాళ్ళకు ఏమీ ఇబ్బంది లేకపోవచ్చు. కానీ ఇంగ్లాండ్‌లో కూడా ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వాళ్ళు ఇబ్బందిపడతారు. పియర్స్ మోర్గాన్‌ని పాత్రికేయుడు అని సంభోదించడానికి కూడా సిగ్గేస్తోంది. బజారు మనిషిలా మాట్లాడాడన్నది వాస్తవం. పియర్స్‌ని తిట్టడం కూడా తప్పు కాకపోవచ్చు. కానీ మోర్గాన్ చేసిన పనినే మనమూ చేసి ఇంగ్లాండ్ ప్రజలలో కొంతమందినైనా బాధ పెట్టడం మాత్రం ముమ్మాటికీ తప్పే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close