అపజయం శాశ్వితం కాదు: సోనియా గాంధీ

ఎన్నికలు ప్రక్రియ మొదలైన ప్రతీసారి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక అనూహ్యమైన వ్యూహంతో ముందుకు వస్తుంది. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ , నితీష్ కుమార్ లతో పొత్తులు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తులు, తమిళనాడులో విజయావకాశాలున్న డిఎంకెతో పొత్తులు అందుకు చక్కటి ఉదాహరణలు. కానీ దాని దురదృష్టమో లేదా ఎక్కడో లెక్క తప్పడం వలనో తరచూ ఎదురుదెబ్బలు తింటూ ఉంటుంది.

అలాగే ఎన్నికలలో ఓడిపోయిన ప్రతీసారి ‘అందుకు రాహుల్ గాంధీది ఏమాత్రం బాధ్యత కాదు…ఆయననే పార్టీ అధ్యక్షుడుగా నియమించాలి..’వంటి మాటలు కూడా వినిపిస్తుంటాయి. ఈసారి కూడా దిగ్విజయ్ సింగ్ వంటి వాళ్ళు పార్టీ ప్రక్షాళన..రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు వంటి రొటీన్ డైలాగులు అన్నీ వినిపించేశారు. ఆ తరువాత కార్యక్రమం నాలుగు ఓదార్పు మాటలు చెప్పుకోవడం. అంతే ఆ తరువాత మళ్ళీ అంతా రొటీన్ ఆలోచనలు..కార్యక్రమాలే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ ఆఖరి తంతు కూడా ఇవ్వాళ్ళ ముగించేశారు.

ఆమె డిల్లీలో పార్టీ నేతలని,కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “సిద్ధాంతాలను, నైతిక విలువలను పక్కనబెట్టి సాధించిన గెలుపు శాశ్వితం కాదు. అలాగే సిద్ధాంతాలు, విలువలని నమ్ముకొన్న వారి ఓటమి కూడా శాశ్వితం కాదు. అడ్డుదారిలో విజయం సాధించిన వారు ఎంత వేగంగా పైకి వస్తారో అంతకంటే వేగంగా పతనం అవుతుంటారు. కానీ నైతిక విలువలని నమ్ముకొన్నవారు తాత్కాలికంగా నష్టపోవచ్చేమో గానీ మళ్ళీ తప్పకుండా విజయం సాధిస్తారు,” అని అన్నారు.

బహుశః అసోంలో భాజపా, కేరళలో వామపక్షాల విజయం అనైతికమని ఆమె అభిప్రాయం కావచ్చు. కాంగ్రెస్ గెలిస్తేనే అది నైతికం, ప్రజాస్వామ్య విజయం లేకుంటే అనైతికం, అవినీతిమయం అని ఆమె భావిస్తున్నట్లే మిగిలిన పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్, భాజపాలతో సహా అన్ని పార్టీలు ఆ తానులో ముక్కలే. ఎన్నికలలో గెలిచేందుకు అవి ఎంతకైనా దిగజారడానికి సిద్ధం. తమిళనాడులో మూడు కంటైనర్ల నిండా సుమారు 500 కోట్లు పట్టుబడింది కానీ అది ఏ పార్టీకి చెందిందో ఇంతవరకు బయటపడలేదంటే, రాజకీయాలలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో ఊహించుకోవచ్చు. కనుక పార్టీ ఏదైనా సరే సిద్ధాంతాలు, నీతి కబుర్లు వల్లెవేసుకోవడానికే తప్ప ఆచరణకి పనికిరావని ప్రతీ ఎన్నికలు రుజువు చేస్తూనే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close