అర శాతం కూడా రావట్లేదు..ఏపీ వైపు చూడని విదేశీ ఇన్వెస్టర్లు !

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వెనుకబడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏపీకి కేవలం రూ. .1,682 కోట్లు మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు… ఎఫ్‌డీఐలు వచ్చాయి. మొత్తంగా ఇండియాకు వచ్చిన విదేశీల్లో పెట్టుబడుల్లో ఇది అరశాతం కూడా లేదు. 2021-22లో మొత్తం రూ.4,37,188 కోట్ల ఎఫ్‌డీఐలు ఇండియాకు వస్తే ఏపీకి 1682 కోట్లు మాత్రమే వచ్చాయి. తెలంగాణకు రూ.11,965 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

కేటీఆర్ ట్విట్టర్‌లో విమర్శలు చేసే కర్ణాటక గత ఏడాది ఈ ఎఫ్‌డీఐల విషయంలో చాంపియన్‌గా నిలిచింది. వచ్చిన పెట్టుబడుల్లో 37 శాతం కర్ణాటకకే వెళ్లాయి. తర్వాత మహారాష్ట్ర , గుజరాత్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ ఏడో ప్లేస్‌లోఉండగా.. ఏపీ టాప్ టెన్‌లో లేకుడా పోయింది. గత ఏడాది వరకు మొత్తం పెట్టుబడుల్లో మొదటిస్థానంలో ఉన్న గుజరాత్‌ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత పరిశ్రమలకు.. పెట్టుబడులకు ప్రాధాన్యం తగ్గించారు.

పీపీఏల రద్దు.. ఎంవోయూలు చేసుకున్న పరిశ్రమలను వెళ్లగొట్టడంతో పెట్టుబడులన్నీ ఆగిోయాయి. 2019 అక్టోబరు నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన విదేశీ పెట్టుబడి కేవలం రూ.3,796 కోట్లు మాత్రమే. లోకల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం ఎప్పుడో మానేశారు. విదేశీ పెట్టుబడులూ లారవడం లేదు .దీంతో ఏపీ పారిశ్రామిక రంగం పూర్తిగా కుదలైంది. అయితే ఆర్బీఐ చెప్పే వాస్తవాలు ఇలా ఉండగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం.. రూ. వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. రూ. కోట్లు పెట్టి పత్రికా ప్రకటనలు ఇస్తూ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close