ప్చ్.. గవర్నర్‌గా కృష్ణంరాజుకు నో చాన్స్..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేత కృష్ణంరాజు.. తనకు ఆరోగ్యం సహకరించకపోయినా.. ఇటీవలి కాలంలో.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అడపాదడపా… ప్రెస్‌మీట్లు పెట్టి.. పార్టీ విధానం ప్రకారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ కోసం ఇంత కష్టపడుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారని.. ఎవరైనా అడిగితే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా… ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని చెబుతున్నారు. ఆయన చూపు అంతా గవర్నర్ పదవిపైనే ఉందని.. చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.

గతంలో బీజేపీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో… రెండు సార్లు ఎంపీగా గెలిచినా… కృష్ణంరాజు.. రాజకీయ పలుకుబడిని పూర్తి స్థాయిలో సంపాదించుకోలేకపోయారు. ఆ తర్వాత పీఆర్పీలోకి వెళ్లడం… మళ్లీ బీజేపీకి రావడం జరిగిపోయిది. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఆయన శక్తి మేర పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేంందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో తాను గవర్నర్‌గా వెళ్లేందుకు ఆసక్తితో ఉన్నానని మీడియాకు చెప్పారు. దానికి తగ్గట్లుగానే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చెప్పినట్లు ప్రచారం చేశారు. కానీ చివరికి బీజేపీ హ్యండిచ్చింది. ఏడు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లను నియమించినా.. కృష్ణంరాజుకు మాత్రం అవకాశం దక్కలేదు.

గవర్నర్‌గా వెళ్లేందుకు కృష్ణంరాజు.. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మొదట్లో… కచ్చితంగా గవర్నర్‌గా పంపిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ .. ఇప్పుడు మాత్రం…. వచ్చే ఎన్నికల్లో రెబల్ స్టార్‌గా మీ అవసరం చాలా ఉంది కాబట్టి… మీరు ఏపీలోనే ప్రచారం చేయాల్సి ఉంటుందని అందరికీ చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్‌ మాలిక్‌ను జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌గా నియమించారు. బిహార్‌ కొత్త గవర్నర్‌గా లాల్జీ టాండన్‌ నియమితులయ్యారు. మేఘాలయ గవర్నర్‌గా తథాగత రాయ్‌, త్రిపుర గవర్నర్‌గా కప్తాన్‌ సింగ్‌ సోలంకి, సిక్కిం గవర్నర్‌గా గంగా ప్రసాద్‌, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బేబీ రాణి మౌర్య, హరియాణ గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close