కొత్తనీరు గొడవ : నామినేటెడ్‌ పదవుల వివాదం!

ఏపీలో ప్రతిపక్షం నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి పెద్ద సంఖ్యలో వలసలు వస్తున్నాయి. ఈ పరిణామాల మీద తెలుగుదేశం విపరీతంగా బలోపేతం అయిపోతుందనే సంతోషం పార్టీకి చెందిన కొందరు అగ్రనాయకుల్లో ఉండవచ్చు గాక. కానీ.. వైకాపానుంచి ఎమ్మెల్యేలతో పాటూ వారి అనుచరులు, మండల, నియోజకవర్గస్థాయి ఇతర నాయకులు ఇలా అనేక మంది వలసలు వచ్చేస్తూనే ఉన్నారు. వారందరికీ తెదేపా నాయకత్వం ఎలాంటి న్యాయం చేస్తుంది అనేది ఆ పార్టీలో ఉత్కంఠభరితమైన చర్చగా సాగుతోంది.

చంద్రబాబునాయుడేమో ఇప్పటిదాకా నామినేటెడ్‌ పదవులను కూడా పార్టీని నమ్ముకున్న జెండాను మోసిన కార్యకర్తలకు పదవులు పంచకుండా రెండేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు.కార్యకర్తల్లో నామినేటెడ్‌ పదవులకోసం నిరీక్షణ పర్వం విపరీతంగా పెరిగిపోతున్నది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పెరుగుతున్న వలసలు ఈ పదవుల ఆశావహుల్లో కొత్త భయాలు రేకెత్తిస్తున్నాయి.

వైకాపాను ఎంత దారుణంగా దెబ్బ కొట్టాలని చంద్రబాబునాయుడు అనుకున్నప్పటికీ.. ఆ పార్టీనుంచి ఎమ్మెల్యేలను తీసుకుంటే సరిపోతుంది కదా.. ఇతర నాయకులనందరినీ ఇప్పటినుంచి చేర్చుకోవడం ఎందుకు? అనే మాట వినిపిస్తోంది. కొత్తగా వస్తున్న నాయకులు నామినేటెడ్‌ పదవులకు కూడా పోటీ పడతారేమో అనే భయం వారిలో పెరుగుతోంది. వలసనేతలకు టికెట్‌ గ్యారంటీ మాత్రమే ఇవ్వాలని, నామినేటెడ్‌ పదవులు ఇవ్వరాదని పార్టీ నాయకులు పార్టీ పెద్దలను కోరుతున్నారంటే వారిలో భయాలు ఏ రేంజిలో చెలరేగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close