కెసిఆర్‌ వార్తలేని నమస్తే! విఫలమైతే వేయరా?

తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏం చేసినా ఏం మాట్లాడినా అది అందరినీ ఆకర్షించడం సహజం. అందులోనూ రాజకీయ పాలనావసరాల కోసం ఆయన చేసే పనులు మరింత ప్రచారం పొందుతుంటాయి. ఈ విషయంలో నమస్తే తెలంగాణ ముందుటుందని చెప్పవనసరం లేదు. అలాటి పత్రికలో ఆదివారం నాడు ముఖ్యమంత్రికి సంబంధించిన అతి ముఖ్యమైన వార్త లేకపోవడం ఆశ్చర్యం కలిగించడమే గాక ఆసక్తి రేకెత్తించింది. రాష్ట్ర రాజకీయాలలో పెద్ద సంచలనంగా వున్న మల్లన్నసాగర్‌ పూర్తి చేయడం కోసం కెసిఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి రైతులను రప్పించి మాట్లాడినా ఫలితం లేకపోవడం వల్లనే నమస్తే ఆ వార్త వదిలేసిందా? వేములఘాట్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామాల రైతులు భూ సేకరణ పేరిట ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించారు, నెలల తరబడి నిరాహారదీక్షలు నిరసనలు చేస్తున్నారు. నీటిపారుదల మంత్రి హరీశ్‌ రావు వారిలో 80 శాతం మందిని ఒప్పించారని ఒక దశలో చెప్పారు గాని అవేమీ నిజం కాలేదు. తమ భూముల మార్కెట్‌ ధరను తక్కువ చూపించి పరిహారం , పునరావాస చర్యలు అరకొరగా చేస్తామంటే ఒప్పుకోబోమని ఆ రైతలు పోరాడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్నే మార్చేసి తనకు అనుకూలమైన నిబంధనలు పొందుపర్చినా వారు మాట వినడం లేదు. ఈ నేపథ్యంలో కెసిఆర్‌ స్వయంగా రంగ ప్రవేశం చేసి ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి ఆ గ్రామ రైతులను పిలిపించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ ఒక్క చోట పరిహారం పెంచలేము గాని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ చర్యలు విస్తారంగా అమలు చేస్తామని చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించారు. కాని వారు మాత్రం తమ భూములకు 2013 చట్టం ప్రకారం ఎకరాకు 20 లక్షలు పరిహారం వస్తుందని పదేపదే చెప్పారు. చాలా వరకు భూమి సేకరించాము గనక మీరు ఇవ్వకపోయినా కట్టితీరతామని కెసిఆర్‌ కరాఖండిగా చెప్పడంతో రైతులు కూడా అదే రీతిలో స్పందించారు. మాకు ఆమోదమయ్యేలా పరిహారం ఇవ్వకపోతే గుంజుకోండ్రి.. ఉట్టిగనే ఇస్తాం అని వారు గట్టిగానే బదులు చెప్పి వచ్చేశారు. ఇంకా తమకు జరుగుతున్న అన్యాయం గురించి, తలకిందులవుతున్న జీవితాల గురించి కూడా వివరంగానే చెప్పారట. పైగా తమ కోసం వండిన భోజనాలు కూడా చేయకుండానే వచ్చేశారు. ఈనాడు , నవతెలంగాణ మొదటి పేజీలో ప్రముఖంగా ఇచ్చిన ఈ వార్త నమస్తే తెలంగాణలో చోటు నోచుకోకపోవడం వింతగా లేదూ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close