కాంగ్రెస్‌ పార్టీదీ క్షమించరాని పాపం..! ఏపీ వాళ్లకీ పట్టలేదు.!!

రాజకీయ అవసరాల కోసం.. రాష్ట్ర విభజనను అడ్డగోలుగా చేసిన కాంగ్రెస్ పార్టీ సహా.. బీజేపీ .. ఇతర పార్టీలు ఏవీ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసే విషయంలో మాట సాయం చేయడానికి కూడా ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పిదం చేసింది. గల్లా జయదేవ్.. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన తర్వాత… మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఆంధ్రప్రదేశ్‌ హామీల పై మాత్రం అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. గల్లా ప్రసంగాన్ని అభినందించి… ఇతర అంశాలకు వెళ్లిపోయారు. దేశంలో ఇతర అంశాల పట్ల ఆయన స్పందన ఎలా ఉన్నా… అసలు … కాంగ్రెస్ పార్టీ వల్ల అన్యాయానికి గురైన రాష్ట్రానికి… భరోసా మాత్రం ఇవ్వలేదు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా మీరివ్వకపోతే.. మేమిస్తామని… గర్జించి ఉంటే.. కేంద్రంలో కదలిక వచ్చి ఉండేది. కానీ రాహుల్ … రాఫెల్‌పై ఎక్కువ ప్రేమ పెంచుకున్నారు. దాని కేంద్రంగానే.. కేంద్రంపై విమర్శలు చేశారు. పైగా ఓ హగ్‌తో అందరి దృష్టి తన వైపు ఉండేలా చేసుకున్నారు. నాడు రాష్ట్ర విభజనకు కారణమైన అన్నీ పార్టీలు ఇప్పుడు లోక్‌సభలో ఉన్నాయి. ఆనాడు… విభజనకు మద్దతుగా నిలబడిన ఏ ఒక్క పార్టీ కూడా… ఈ రోజు ఆ విభజన వల్ల అన్యాయమైన ఏపీకి అండగా నిలబడలేదు. ఒక్కరంటే.. ఒక్కరు కూడా ఆంధ్రప్రేదశ్ సమస్యలను ప్రస్తావించలేదు. ఎవరి రాజకీయ అజెండా వారు చూసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. పదే పదే… ఆయన ప్రాంతీయ పార్టీల నేతలందరికీ ఫోన్ చేసి… పార్లమెంట్‌లో తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. కానీ ఎవరూ… ప్రస్తావించలేదు.

ఇక కాంగ్రెస్‌తో పాటు విభజన పాపంలో పాలు పంచుకున్న బీజేపీ.. అప్పుడు… కాంగ్రెస్ చేసినదాని కంటే ఎక్కువగా ఇప్పుడు ద్రోహం చేస్తోంది. ఇతర పార్టీలూ అదే దారిలో ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలకు చెందిన జాతీయ పార్టీల నేతలు.. ఏపీపై కుట్రలు చేస్తున్నారు. ఏపీకి ఏమైనా ప్రొత్సహకాలు ఇస్తే.. అది తమ రాష్ట్రాలపై పడకుండా ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు. అంతిమంగా చూస్తే..ఏపీ విభజన పాపంలో పాలు పంచుకున్న ఏ ఒక్క పార్టీ కూడా.. నిన్న ఏపీకి సపోర్ట్‌గా రాలేదు. మోదీ మాటల్లో చెప్పాలంటే… తల్లిని చంపిన వారు బిడ్డను ఆదుకోవడానికి ఆసక్తి చూపలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com