కడప స్టీల్ ప్లాంట్ అంశం… కేంద్రానికి చీమకుట్టినట్టైనా లేదే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భాజ‌పా నేత‌లు మైకావేశంతో చాలాచాలా మాట్లాడ‌తారు! ఆంధ్రాకి అన్నీ ఇచ్చెయ్య‌డానికి కేంద్రం సిద్ధంగా కూర్చుకుని ఉంటే, ఎలా తీసుకెళ్లాలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెలీడం లేద‌న్న‌ట్టు మాట్లాడ‌తారు! కానీ, ఢిల్లీ స్థాయిలో భాజ‌పా నేత‌ల వైఖ‌రి మ‌రోలా ఉంటోంది. వారికి క‌నీసం చీమ‌కుట్టిన‌ట్టైనా ఉండ‌టం లేదు. క‌డ‌ప స్టీల్ ప్లాంట్ విష‌య‌మై మ‌రోసారి ఢిల్లీ స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేశారు టీడీపీ నేత‌లు. రాయ‌ల‌సీమ ప్రాంత నేత‌ల‌తోపాటు, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర‌మంత్రి బీరేంద్ర సింగ్ ను క‌లుసుకున్నారు. క‌డ‌ప ప్లాంటును వెంట‌నే ప్ర‌క‌టించాలంటూ ఆయ‌న్ని కోరారు. అయితే, మ‌ళ్లీ మళ్లీ ఎందుకు అడుగుతారు, ఒక‌సారి చెప్పాం క‌దా అన్న‌ట్టుగానే ఆయ‌న స‌మాధానం ఉండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాదు, ఈ పార్ల‌మెంటు స‌మావేశాల్లో క‌డ‌ప స్టీల్ ప్లాంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం లేద‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు క‌ట్టిన‌ట్టు చెప్పేయ‌డం విశేషం.

క‌డ‌ప స్టీల్ అంశ‌మై టీడీపీ ఎంపీలు రాష్ట్రప‌తిని కూడా క‌లిశారు. టీడీపీ నేత‌లంద‌రికీ అనుమ‌తి లేద‌న‌డంతో, కొంత‌మంది ఎంపీల‌తో కూడిన ప్ర‌తినిధుల బృందం రామ్ నాథ్ కోవింద్ కి విన‌తిప‌త్రం ఇచ్చారు. సీఎం ర‌మేష్‌, రామ్మోహ‌న్ నాయుడు, మాజీ కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజులు రాష్ట్రప‌తిని క‌లిసినవారిలో ఉన్నారు. క‌డ‌ప స్టీల్ ప్లాంట్ విష‌య‌మై సీఎం ర‌మేష్ చేసిన దీక్ష గురించి తాను విన్నానంటూ రాష్ట్రప‌తి సానుకూలంగానే స్పందించారు. అయితే, ఆయ‌న‌కి విన‌తి ప‌త్రం ఇచ్చినంత మాత్రాన‌… కేంద్ర ప్ర‌భుత్వానికి ఆయ‌న సూచిస్తార‌ని ఆశించ‌లేం. ఒక‌వేళ మ‌ర్యాద‌పూర్వ‌కంగా ప్ర‌ధానికి రాష్ట్రప‌తి సూచించే ప్ర‌య‌త్నం చేసినా… దాన్ని మోడీ ఎంత సీరియ‌స్ గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటార‌నేది ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకోవాల్సిన అవ‌స‌రం లేని విష‌యం!

ఏదేమైనా, ఆంధ్రా ప్ర‌యోజ‌నాల విష‌య‌మై కేంద్రం చిత్త‌శుద్ధి ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ఓప‌క్క‌, ఈ పార్ల‌మెంటు స‌మావేశాలు ముగిసేలోగానే క‌డ‌ప ప్లాంట్ ప్ర‌క‌టించేస్తార‌న్న‌ట్టుగా ఏపీ భాజ‌పా నేత‌లు ఇక్క‌డ మాట్లాడ‌తారు. కానీ, కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ మాత్రం ఈ సెష‌న్స్ లో అలాంటి ప్ర‌క‌ట‌న‌కు ఆస్కార‌మే లేద‌నీ, ఇంకా మెకాన్ సంస్థ నుంచి నివేదిక రావాల్సి ఉంద‌ని చెబుతారు. ఒక‌వేళ కేంద్రానికి నిజంగానే చిత్త‌శుద్ధి ఉంటే… మెకాన్ సంస్థ నుంచి నివేదిక తెప్పించుకోవ‌డం అనేది ఎంత ప‌ని..? కేంద్రం అన్నీ ఇచ్చేస్తుంద‌ని ఏపీ నేత‌లు అంటారు… కానీ, కేంద్ర‌మంత్రుల తీరు ఇంకోలా ఉంటోంది. ఏదేమైనా, ప‌ట్టువ‌ద‌లక టీడీపీ ఎంపీలు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close