మ‌హేష్ సినిమా ర‌న్ టైమ్ ఎంత‌?

మ‌హర్షి దాదాపు మూడు గంట‌ల పాటు సాగింది. అంత‌కు ముందు శ్రీ‌మంతుడుకీ నిడివి స‌మ‌స్య‌లున్నాయి. అయితే మ‌హేష్ బాబు కొత్త సినిమా ‘స‌రిలేరు నీకెవ్వ‌రు కూడా నిడివి లెక్క‌ల ప్ర‌కారం పెద్ద సినిమానే. కొద్ది సేప‌టి క్రిత‌మే ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సెన్సార్ కార్య‌క్ర‌మాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి యు బై ఏ స‌ర్టిఫికెట్ అందుకుంది. 167 నిమిషాల ర‌న్ టైమ్ వ‌చ్చింది. అంటే దాదాపు 2 గంట‌ల 47 నిమిషాలు. ఇందులో 7 నిమిషాలు యాడ్స్‌. అంటే రెండు గంట‌ల 40 నిమిషాల సినిమా అన్న‌మాట‌. ఈమ‌ధ్య పెద్ద సినిమాల‌న్నీ 160 నిమిషాల‌కు మించే ఉంటున్నాయి. ఈ రోజుల్లో సినిమా కాస్త లాగ్ అనిపించినా – అది సినిమాకి పెద్ద ప్ర‌తికూలాంశంగా మారుతుంది. ఎట్టిప‌రిస్థితుల్లోనూ రెండున్న‌ర గంట‌లు మించ‌కూడ‌ద‌ని అనుకున్నారు. రైలు ఎపిసోడ్ 30 నిమిషాలు వ‌చ్చింది. కశ్మీర్ స‌న్నివేశాలు మ‌రో 15 నిమిషాలు సాగాయ‌ని తెలుస్తోంది. ఎంట‌ర్‌టైన్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చార‌ని, ఆయా స‌న్నివేశాల‌న్నీ బాగా వ‌చ్చాయ‌ని అందుకే ర‌న్ టైమ్ పెరిగింద‌ని అంటున్నారు.

సెన్సార్ అయిన‌ప్ప‌టికీ పోస్ట‌రుపై రిలీజ్ డేట్ మాత్రం వేయ‌లేదు. సాధార‌ణంగా సెన్సార్ అయ్యాక రిలీజ్ డేట్‌తో పోస్ట‌ర్ విడుద‌ల చేస్తుంటుంది చిత్ర‌బృందం. స‌రిలేరు విష‌యంలో మాత్రం ‘సంక్రాంతి విడుద‌ల‌’తో స‌రిపెట్టారు. అల వైకుంఠ‌పుర‌ములో విడుద‌ల తేదీ ఇంకా ఖ‌రారు కాలేనందున‌, స‌రిలేరు రిలీజ్ డేట్ ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. బ‌న్నీ ఫిక్స‌యిన వెంట‌నే మ‌హేష్ సినిమా కొత్త రిలీజ్ డేట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ.. ఈ సినిమా సంక్రాంతి విడుద‌ల‌నే అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close