పాపం బండ్ల..! బట్టీపట్టిన “ప్రమాణ పాఠాన్ని” ఏంజేయాలె..!

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు, పవన్ కల్యాణ్ భక్తుడు బండ్ల గణేష్.. ఎమ్మెల్యే అయిపోయినట్లేనని..నిన్నామొన్నటి వరకూ అనుకున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా చేయాల్సిన ప్రమాణాన్ని బట్టీ పట్టారు. దాన్ని టీవీ చానళ్లలో యాంకర్లకు… ఆ పాఠాన్ని అప్పజెప్పారు కూడా. అంతగా.. ఎమ్మెల్యే అయిపోవడానికి ప్రిపేరయిపోయిన బండ్ల గణేష్ కు ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎమ్మెల్యే అవ్వాలంటే.. పోటీ చేయాలి.. పోటీ చేయాలంటే.. టిక్కెట్ కావాలి.. ఇప్పుడా ఆ టిక్కెట్టే రావడం లేదు. గాడ్ పవన్ కల్యాణ్ ని వదిలేసి… గాడ్ ఫాదర్లను పట్టుకుని… రాహుల్ గాంధీతో కాంగ్రెస్ కండువా కప్పించుకుని… ఇక పోటీనే అనుకుంటున్న సమయంలో .. ఢిల్లీ నుంచి వరుసగా వస్తున్న జాబితాల్లో తన పేరు కనిపించడం లేదు.

మొదటగా జూబ్లీహిల్స్ అనుకున్నారు. అక్కడ కలసి రాదని.. అనుకున్నారో… గాడ్ ఫాదర్లు సలహా ఇచ్చారో కానీ.. రాజేంద్రనగర్ అన్నారు. టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి… చాలా సార్లు ఢిల్లీ వెళ్లారు. టీడీపీ అధినేత వస్తే కలిశారు. రాజేంద్రనగర్ తనకు రాసి పెట్టి ఉందని..పొత్తులో భాగంగా టీడీపీకి అడగవద్దని.. ఓ విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చేశారు. చంద్రబాబు దాన్ని చూశారో లేదో కానీ… రాజేంద్రనగర్ టీడీపీకే వచ్చింది. అక్కడ్నుంచి మరో గణేష్ ను.. అంటే గణేష్ గుప్తాను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో బండ్ల గణేష్ హర్టయ్యాడు. అయినా… బండ్ల గణేష్ తనకు తాను… మీడియా చానళ్లలో తిరగి… ఎమ్మెల్యే అభ్యర్థినని ప్రచారం చేసుకోవడమే కానీ.. ఎక్కడా… ఆయన ఫలానా చోట రేసులో ఉన్నారన్న ప్రచారమే జరగలేదు. సామాజికవర్గ కోటాలో ఆయన కోసం… ఆయనకు గాడ్ ఫాదర్ భావిస్తున్న చానల్ యజమాని.. ప్రయత్నం చేసినా.. పట్టించుకున్న పాపాన పోలేదు.

అసలు పరిశీలనకే బండ్ల గణేష్ పేరు వెళ్లలేదని.. ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. అయినా బండ్ల గణేష్ కు ఆశలు తీరలేదు. ఏదో ఒక చోట పోటీ చేయాలనే తలంపుతో మిగిలిన సీట్లలో అయినాచోటు దొరుకుతుందేమోనని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అందరూ ఆయనను పొలిటికల్ కమెడియన్ గానే చూశారు. ఎవరూ పట్టించుకోలేదు. గాడ్ ఫాదర్ల వల్ల కాలేదు కాబట్టి.. ఇక నేరుగా గాడ్ వద్దకు వెళ్తారేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close