మిత్రులే అవిశ్వాసం పెట్టేలా రాజకీయాలు ఏ నీతి..? మోడీపై యుద్ధం ప్రకటించిన శివసేన..!

భారతీయ జనతా పార్టీతో ఉప్పునిప్పులా వ్యవహరిస్తున్న శివసేన పార్టీ.. ఇప్పుడు పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలనే ఆలోచన చేస్తోంది. చాలా రోజుల నుంచి బీజేపీని టార్గెట్ చేసిన… శివసేన..ఇప్పుడు నేరుగా విమర్శలు చేస్తోంది. పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఇప్పటి వరకూ సంపాదకీయాలు రాశారు. కానీ ఇప్పుడు.. ఉద్ధవ్ థాకరే ఓ ఇంటర్యూ ఇచ్చారు. ఆ ఇంటర్యూ మొత్తం బీజేపీ ఎంత దారుణంగా మిత్రపక్షాలను మోసం చేసిందో..చెప్పడానికే ఉద్ధవ్ థాకరే సమయం కేటాయించారు. నాలుగేళ్ల పాటు అత్యంత నమ్మకంగా వ్యవహరించిన మిత్రపక్ష పార్టీ తెలుగుదేశమే అవివిశ్వాస తీర్మానం పెట్టిందంటే.. అది కచ్చితంగా… బీజేపీ తప్పేనని… డిసైడ్ చేశారు. ఎంత దారుణంగా ఆ పార్టీ నుంచి వంచి ఉంటారోనని… సామ్నా ఇంటర్యూలో ఉద్ధవ్ చెప్పుకొచ్చారు.

నిజానికి శివసేను బుజ్జగించడానికి… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చాలా ప్రయత్నాలు చేశారు. అపాయింట్‌మెంట్ తీసుకుని మరీ వెళ్లి థాకరేల అధికారిక నివాసం మాతోశ్రీకి వెళ్లి చర్చలు జరిపారు. మొన్న అవిశ్వాస తీర్మానం రోజు అనుకూలంగా ఓటేయాలని.. శివసేన నిర్ణయం తీసుకోవడంతో .. అంతా సర్దుబాటు అయిందని.. అనుకున్నారు. కానీ తెల్లవారే సరికి… శివసేన.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రారంభించింది. దీంతో బీజేపీ నేతలు కూడా.. ఇక శివసేన తమకు లేదని ఖాయం చేసుకుంటున్నారు. అమిత్ షా కూడా.. ఆశలు వదిలేసుకుని… సొంతంగా పార్టీ బలోపేతం పై దృష్టి సారించాలని పార్టీ నేతలను ఆదేశించారు.

వాస్తవానికి.. ప్రధానిగా మోడీ.. బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలను బలహీనం చేసి తాను బలపడాలన్న వ్యూహాన్ని అమలు చేశారు. ఏపీలో ప్రత్యేకహోదా బదులు ప్యాకేజీ ఇస్తాం తీసుకోవాలని రాయబారాలు చేసి.. ఇతర పార్టీలను హోదా ఉద్యమాలకు ప్రొత్సహించారు. టీడీపీని బలహీనం చేసి బాగుపడాలనుకున్నారు. ఇదే వ్యూహాన్ని శివసేనపైనా ప్రయోగించాలనుకుంది.. బీజేపీ. వాస్తవంగా.. బీజేపీ, శివసేన రాజకీయ సిద్ధాంతాలు ఒకటే. బాల్ థాకరే మృతి తరవాత ఇక ఆ పార్టీని కబ్జా చేయడానికి బీజేపీ అనేక ఎత్తులు వేసింది. ఇవి తెలిసి..శివసేన తిప్పికొట్టింది. ఇప్పుడు బీజేపీని వదిలించుకోడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com