హైకోర్టు బిల్డింగ్ కట్టడానికీ టెండర్లు వేయలే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంట్రాక్టర్లకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లుగా ఉంది. ప్రభుత్వం ప్రకటించే టెండర్లలో పాల్గొనడానికి ఎవరూ ముందుకురావడం లేదు. కాంట్రాక్టర్లు ముందుకు రాని కారణంగానే రోడ్లను బాగు చేయలేకపోతున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న ఏపీ ప్రభుత్వానికి కొత్తగా ఇతర పనులు చేయడానికి కూడా ఎవరూ ముందుకురావడం లేదు. అమరావతిలో ఉన్న హైకోర్టు భవనాన్ని దాదాపుగా రూ. ముఫ్పై కోట్లతో విస్తరించడానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. నిధులు మంజూరు చేసింది. టెండర్లు పిలిచారు. గడువు పూర్తయిన తర్వాత చూస్తే ఒక్కటంటే ఒక్క టెండర్ ఉంది. అదీ కూడా ఊరూపేరూ లేని కాంట్రాక్టర్ దగ్గర నుంచి.

గతంలో అమరావతిలో పనులు అంటే ఎల్ అండ్ టీ, నాగార్జున , షాపూర్జీ పల్లోంజీ వంటి దిగ్గజ సంస్థలు పోటీ పడేవి. అలా దక్కించుకున్నవే శర వేగంగా అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేశాయి. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం ఆరు నెలల్లోనే పూర్తయింది. సెక్రటేరియట్ భవనాలూ అంతే వేగంగా పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున సంస్థలు పనులు చేయడానికి ముందుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయింది. పనులు చేసినా ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో లేదో తెలియని పరిస్థి ఉండటంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో పనులు కూడా టెండర్ల దగ్గరే ఆగిపోతున్నాయి.

ప్రభుత్వం అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోతే.. ఎవరూ ప్రభుత్వానికి పనులు చేయడానికి రారు. అందుకే ప్రభుత్వాలు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవు. కానీ ప్రభుత్వానికి పనులు చేసినవారందరికీ డబ్బులు ఊరకనే వస్తాయని అందరికీ ఎగ్గొట్టవచ్చన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తూండటంతో కాంట్రాక్టర్లు సైడైపోయారు. ఇప్పటికే వారికి వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాతనే ఇతర పనుల గురించి ఆలోచిస్తామని చెబుతున్నారు. బకాయిలు ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం లేదు. ఫలితంగా ప్రభుత్వ టెండర్లలో పాల్గొనడం కన్నా పక్కా రాష్ట్రాల్లో ఏదో ఓ పని చేసుకోవడం బెటరని కాంట్రాక్ట్ సంస్థ నిర్ణయానికొచ్చేశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close