ఆంధ్రాలో నారాయ‌ణ‌మూర్తికి అన్యాయం

ఈ సంక్రాంతికి ఇద్ద‌రు టాప్ హీరోల సినిమాల‌తో పోటీ ప‌డ్డాడు నారాయ‌ణ మూర్తి. ఆయ‌న న‌టించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య‌’ ఈ నెల‌14న విడుద‌లైంది. సినిమాని పోటీ ప‌డి విడుద‌ల చేశారు గానీ… థియేట‌ర్లు పెద్ద‌గా దొర‌క‌లేదు. మూర్తిగారేం చేశారో చూద్దామ‌ని ఆశ ప‌డిన వాళ్లంద‌రికీ థియేట‌ర్లో సినిమా లేక‌పోవ‌డంతో నిరాశే ఎదురైంది. నైజాంలో 23 థియేట‌ర్లు దొరికితే.. ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ప‌ట్టుమ‌ని నాలుగు థియేట‌ర్లు కూడా దొర‌క‌లేద‌ని చిత్ర బృందం వాపోతోంది.

”నేను ముప్పై ఏళ్లుగా సినిమాలు తీస్తూ వ‌స్తున్నాను. ప‌దిహేనేళ్లుగా అనేక గాయాల‌తో ఈ సినిమా సాగ‌రాన్ని ఎదురీదుతూ వ‌స్తున్నాను. హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య విషయానికి వ‌స్తే, సాధార‌ణంగా నా సినిమా అంటే మినిమ‌మ్ బ‌డ్జెట్‌లో చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్పేలా ఉంటాయి. అయితే చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుగారు బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమా చేశారు. నిజాయితీ గ‌ల వ్య‌క్తిని ఆర్ధిక బంధాలు ఎలా డామినేట్ చేశాయి. అయినా ఆ వ్య‌క్తి ఎలా ఎదిరించి నిలిచాడ‌నే పాయింట్‌తో ఈ సినిమాను చ‌ద‌ల‌వాడ‌శ శ్రీనివాస‌రావుగారు చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఆంధ్ర‌కు వెళ్లిన‌ప్పుడు రాజ‌మండ్రిలో కొంద‌రు మిత్రులు న‌న్ను క‌లిసి సినిమా టాక్ బావుందన్నా కానీ థియేట‌ర్స్‌లో సినిమా లేని కార‌ణంగా సినిమా చూడ‌లేద‌ని అన‌డం నన్నెంతో బాధ‌కు గురి చేసింది. హెడ్ కానిస్టేబుల్ సినిమా ప్రారంభం రోజునే నిర్మాత‌గారు సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేస్తాన‌ని అన్నారు. అలా ఆయ‌న అన‌డం ఆయ‌న త‌ప్పా.. చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ విష‌యంలో రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఓ నిర్ణ‌యం తీసుకుంటేనే చిన్న సినిమాలు బ్ర‌తుకుతాయి. సంక్రాంతి బ‌రిలోకి వ‌చ్చిన కొన్ని సినిమాల‌కే థియేట‌ర్స్‌ను కేటాయించ‌కుండా, అన్నీ సినిమాలకు న్యాయం జ‌రిగేలా చూడాలి” అన్నారాయ‌న‌.

థియేట‌ర్లు లేక‌పోయినా అనుకొన్న స‌మ‌యానికి చెప్పిన టైమ్‌కి సినిమాని రిలీజ్ చేయ‌డ‌మే త‌మకు ల‌భించిన అతి పెద్ద జ‌య‌మ‌ని ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ చెబుతున్నారు. సంక్రాంతి పోటీలో ఉండాల‌నుకోవ‌డం త‌ప్పు లేదు. కానీ… పెద్ద సినిమాల ఉధృతిలో కొట్టుకుపోకుండా కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది. నారాయ‌ణ‌మూర్తి సినిమా ఒక్క వారం ఆగి వ‌చ్చినా… కావ‌ల్సిన‌న్ని థియేట‌ర్లు దొరికేవి. పోటాపోటీగా త‌న సినిమాని విడుద‌ల చేయ‌డంతో.. థియేట‌ర్ల స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంది. ఈ వారం సినిమాలేం లేవు. కాబ‌ట్టి హెడ్ కానిస్టేబుల్‌కి కొత్త‌గా కొన్ని థియేట‌ర్లు దొరికే అవ‌కాశం ఉంది. అయితే అప్ప‌టికే ఈసినిమా టాక్ అంద‌రికీ తెలిసిపోయి.. చూడాల‌న్న ఇంట్ర‌స్ట్ కూడా త‌గ్గిపోవొచ్చు. పైగా సంక్రాంతి సీజ‌న్ కూడా అయిపోయింది. ఈ ద‌శ‌లో ఎన్ని థియేట‌ర్లు దొరికినా లాభం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close