నాయినికి మొండి చేయి..కొదాడలో టీడీపీ నేతకు టిక్కెట్..! కేసీఆర్ ఫినిషింగ్ టచ్..!!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. మొదటి లిస్ట్ ప్రకటించిన దాదాపు 70 రోజుల తర్వాత చివరి రెండు టిక్కెట్లు ప్రకటించారు. ముషీరాబాద్ నుంచి.. గత ఎన్నికల్లో పోటీ చేసిన ముఠా గోపాల్‌కే టిక్కెట్ ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని… ఉవ్విళ్లూరిన.. నాయిని నర్సింహారెడ్డికి షాక్ ఇచ్చారు. అయినా తన అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి లేకపోతే.. తనకు ఇవ్వాలని… నాయిని పట్టుబట్టారు. ముషీరాబాద్‌తో తనకు నలభై ఏళ్ల అనుబంధమని వాదించారు. కానీ… కేసీఆర్ నాయినికి కానీ.. ఆయన కుటుంబానికి కానీ ఇవ్వాలనుకోలేదు. అందుకే ఎప్పటికప్పుడు సీటు పెండింగ్‌లో పెట్టారు. మధ్యలో నాయిని నర్సింహారెడ్డి అల్లుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. వీటన్నింటినీ తట్టుకుని నాయిని.. కేసీఆర్‌పై నమ్మకం పెట్టుకున్నారు. చివరికి నాయినిని బుజ్జగించి.. ముఠా గోపాల్‌కే టిక్కెట్ ఖరారు చేశారు కేసీఆర్.

ఇక కోదాడ టిక్కెట్ విషయంలోనూ.. కేసీఆర్ చివరి వరకు నాన్చారు. అక్కడ టీఆర్ఎస్‌ టిక్కెట్ కోసం.. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, గత ఎన్నికల్లో పోటీ చేసిన శశిధర్ రెడ్డి టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ వారి కంటే బలమైన అభ్యర్థి దొరుకుతారేమోనని.. కేసీఆర్ ఎదురు చూశారు. ఓ దశలో చందర్ రావు టిక్కెట్ ఖరారయిందన్న ప్రచారం కూడా జరిగింది. కోదాడ సీటు కూటమి సీట్ల సీట్ల పంపకాల్లో భాగంగా.. టీడీపీకి వెళ్తుందని.. అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి.. గట్టి పోటీ ఇచ్చిన బొల్లం మల్లయ్య యాదవ్ కు టిక్కెట్ ఇస్తారని అనుకున్నారు. కానీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణికి టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో… కోదాడ కాంగ్రెస్ ఖాతాలోనే పడిపోయింది. దీంతో మల్లయ్య యాదవ్‌ను.. టీఆర్ఎస్ వెంటనే పార్టీలో చేరుకుంది. ఒక్క రోజు వ్యవధిలో టిక్కెట్ ఖరారు చేసింది.

తెలంగాణలో… మొత్తం 119 స్థానాల్లోనూ.. టీఆర్ఎస్ పోటీ చేస్తోంది. మొదటగా 105 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత మూడు సార్లు.. మిగతా పధ్నాలుగు సీట్లను ఖరారు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఓసీలు – 58 ఎస్సీ – 19 ఎస్టీ 12 సిక్కు – 1 బీసీ – 26 ముస్లిం – 3 స్థానాల్లో అవకాశాలు ఇచ్చారు. మహిళలు మాత్రం 119 మందిలో నలుగురు మాత్రమే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close