తెలకపల్లి వ్యూస్ : మాట పోయిన వెంకయ్య వైదొలగుతారా?

ఇప్పటి వరకూ వైసీపీ నుంచి సామూహిక ఫిరాయింపుల కారణంగా తెలుగుదేశం అధినేత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా పైచేయి సాధించినట్టు కనిపించారు. తమ వారితోనూ అనిపించారు. బహుశా ఈ ఆనందం అనుమతించకూడదనే కావచ్చు మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా లేదంటూ ఆఖరి బాంబు పేల్చింది. ఇది చంద్రబాబుతో సహా తెలుగుదేశం నాయకులకూ మా వంటివారికీ కూడా తెలిసిన విషయమే. బిజెపి నేతలు చెబుతున్నదే కూడా. అయినా సరే ప్రత్యేక హోదా కాకపోతే ప్యాకేజీ అంటూ రకరకాలుగా మాట్లాడుతూ కేంద్రాన్ని వెనకేసుకొచ్చిన తెలుగుదేశం నేతలకు ఈ పరిస్థితి చాలా చాలా ఇబ్బందికరం. సంయమనం తప్ప సంఘర్షణ వద్దని చంద్రబాబు పదేపదే చెబుతుంటే జీర్ణించుకోవడం కూడా వారికి కష్టంగానే వుంది.

ప్రజలు ఆ సాకులనూ సమర్థనలనూ ఆమోదించబోరని క్షేత్రస్థాయిలో వారికి బాగా తెలుసు. మంత్రివర్గంలోంచి బయటకు రావాలా అని మాత్రమే అడుగుతున్నారు తప్ప దానికన్నా ముందు చాలా దశలుంటాయని తెలుగుదేశం నేతలు ఒప్పుకోవడం లేదు. అన్నీ చంద్రబాబే తెచ్చారని, రాకపోతే పోరాడారని అనిపించుకోవాలన్నదే వారి వ్యూహం. అఖిలపక్షం అనగానే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ, ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాని కాంగ్రెస్‌, కమ్యూనిస్టులను కలుపుకోవలసి వుంటుంది. ఢిల్లీలో వారికి ఎక్కువ ప్రాతినిధ్యం వుంటుంది. ఆ విధంగా చంద్రబాబు ప్రాధాన్యత, తెలుగుదేశం ఘనత వెనక్కు పోతాయన్నది వారి దిగులు. పైగా ఇంతకాలం ఆగి ఇప్పుడు అఖిలపక్షం అనో మరొకటనో అంటే అక్కడే విమర్శలను ఎదుర్కొవలసి వుంటుంది తప్ప అదనంగా ఒరిగేది వుండదని వారిభావం.

ప్రత్యేక హోదా సంజీవిని కాదని చెప్పిన రోజునే చంద్రబాబు నాయుడు మానసికంగా అందుకు సిద్దం చేశారు. బిజెపి టిడిపి రాజకీయ ప్రయోజనాల ఘర్షణ తప్ప ఇందులో రాష్ట్రం పట్ల కేంద్రం రాజ్యాంగ బాధ్యత, రాజ్యసభలో తామే అడిగి సాధించిన హామీ, విశ్వసనీయత వంటి అంశాలు బిజెపికి పట్టడం లేదు.. అందులోనూ వెంకయ్యనాయుడు వ్యక్తిగత విశ్వసనీయతను ఫణం పెట్టడానికి కూడా వెనుకాడ్డంలేదు.

తెలుగుదేశం కేంద్రం నుంచి బయటకు రావడం కాదు- ముందు పదేళ్లు హోదా అడిగి ఇప్పిస్తామని పరిశీలిస్తున్నామని చెబుతూ వస్తున్న వెంకయ్య నాయుడు వంటివారు ముందు బయటకు రావాలి. సభ సాక్షిగా తాను అడిగిన దాన్ని సాధించానని చెప్పుకున్న దాన్ని తానే అధికారంలో వుండి అమలు చేయని అలక్ష్యానికి అవిశ్వాసానికి సంజాయిషీ చెప్పాలి. ఆ పనిచేయకుండా ఎలాటి సూక్తులు చెప్పినా ఎదురుదాడి చేసినా ప్రయోజనం శూన్యం. చంద్రబాబు నాయుడు కూడా వూరికే తటపటాయించుతూ తనపైనే మొత్తం బాధ్యత వేసుకోవడానికి బదులు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అందరినీ కలుపుకుని పోవాలి. అలాగ కాకుండా బిజెపి టిడిపి దాగుడు మూతలు కొనసాగిస్తే ప్రజలు ఎంతోకాలం భరించలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close