పెళ్లి ప్రపోజల్‌తో ఏ అమ్మాయి రాలేందంటున్న సల్మాన్

బాలీవుడ్ కండ‌ల వీరుడు, హీరో స‌ల్మాన్ ఖాన్ పేరు రాగానే ఆయన పెళ్లి గురించే ప్రస్తావన వస్తుంది. ఆయన ప్రేమ వ్యవహరాలు, పెళ్లికి సంబంధించిన వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. సల్మాన్ ప్రేమాయ‌ణాలు అలాంటివి మరి. సల్మాన్ గ‌తంలో చాలా మందితో ప్రేమాయ‌ణాలు సాగించిన విషయం తెలిసిందే.

సల్మాన్ ఖాన్ అన్ని సినీ పరిశ్రమల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్నాడు. అయితే తాజాగా స‌ల్మాన్ ఖాన్ పెళ్లి అయిపోయిదంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక రీసెంట్‌గా సల్మాన్ తన పెళ్లి విషయం గురించి ఓపెన్‌గా చెప్పారు. యాభైమూడేళ్లు వచ్చినా బ్యాచిలర్‌గానే జీవితం కొనసాగిస్తున్న ఈ కండలవీరుడికి పెళ్లి సంబంధించిన ప్రశ్న ప్రతి చోట ఎదురుతూనే ఉంటుంది.

తాజాగా ఫిల్మ్ ఫేర్ ఇంటర్వ్యూలో వివాహానికి సంబంధించిన ప్రశ్న సల్మాన్‌కు ఎదురైంది. సల్మాన్ తాజా చిత్రం భారత్’ సినిమాలో సల్మాన్ దగ్గరకు కత్రినా పెళ్లి ప్రపోజల్‌ తీసుకొచ్చే సన్నివేశం ఉంటుంది. అలాంటి మీ నిజ జీవితంలో జరిగిందా అనే ప్రశ్న సల్మాన్‌ను అడగ్గా.. తన వద్దకు ఇప్పటి వరకు ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుందామనే ప్రపోజల్‌తో రాలేదని సల్మాన్ చెప్పారు. తాను ఎప్పుడూ ఎవరితోనూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఎందుకంటే కొవ్వొత్తి వెలుగులో నేను ఏం తింటున్నానో చూడలేను అని అన్నారు. తన వద్దకు ఎవరూ మ్యారేజ్ ప్రపోజల్‌తో రాకపోవడం చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందని సల్మాన్ ఖాన్ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close