స్టీల్ ప్లాంట్ మద్దతు బంద్‌కు వైసీసీ సపోర్ట్ లేనట్లే..!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఉద్యమం బంద్ దశలోకి వచ్చింది. ఐదో తేదీన ఏపీ వ్యాప్తంగా బంద్ పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు వామపక్షాలు లీడ్ తీసుకుని రంగంలోకి దిగి ప్రచారం చేశాయి. రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రం బంద్ గురించి ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ సమావేశమైనప్పుడు.. వారి ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నట్లుగా చెప్పారు. అయితే.. బంద్ గురించి మాత్రం ప్రస్తుతం ఆ పార్టీ నేతలెవరూ మాట్లాడటం లేదు. విశాఖపట్నాన్ని గుత్తకు తీసుకుని రాజకీయం చేస్తున్న విజయసాయిరెడ్డి బంద్‌కు మద్దతు విషయంలో ఎటూ తేల్చడం లేదు.

తమ పార్టీ అనుకూలమని ఆయన చెప్పడం లేదు. ఉద్యమం ప్రారంభమైన మొదట్లో వామపక్షాలతో కలిసి నడుస్తామని ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చి చెబుతోంది. కేంద్రం మాటలను జవదాటే పరిస్థితిలో ఏపీ సర్కార్ లేదు. ప్రైవేటీకరణ వద్దని ఓ లేఖ రాసినప్పటికీ.. దాని గురించి పెద్దగా ఒత్తిడి చేసే పరిస్థితి కూడా లేదు. అందుకే బీజేపీ నేతలు సైలెంటయిపోయారు. వైసీపీ నేతలు కూడా అదే బాట ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. రాను రాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగా వారి వాయిస్ కూడా మారే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.

ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో మొదట్లో ఉన్నంత వేడి కనిపించడం లేదు. ఆంధ్రుల హక్కు అన్న సెంటిమెంట్ ప్రారంభమైనప్పటికీ.. తర్వాత పార్టియాలిటీ వచ్చి చేరింది. అది ఉద్యోగుల కష్టం అని.. అనుకోవడం ప్రారంభించారు. అమరావతి అంశం అక్కడి రైతులదే అన్నట్లుగా.. స్టీల్ ప్లాంట్ అక్కడి ఉద్యోగుల సమస్యే అన్నట్లుగా పరిస్థితిని మార్చేస్తున్నారు. దీంతో వైసీపీ కూడా స్ట్రాటజీ మార్చుకుంది. బంద్‌కు మద్దతివ్వడం కన్నా సైలెంట్ గా ఉండటమే మంచిదని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close