మా భవనాలకు అనుమతులున్నాయి జాగ్రత్త..!

చాలా ఇళ్ల ముందు ” కుక్క ఉన్నది జాగ్రత్త ” ” బివేర్ ఆఫ్ డాగ్ ” అనే బోర్డులు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తాయి. నిజంగా కుక్క ఉన్నా.. అది.. కొత్త వ్యక్తుల్ని చూసి పారిపోయే రకం విదేశీ కుక్క అయినా సరే… ఆ బోర్డులు మాత్రం కచ్చితంగా పెట్టుకుంటారు. ఎందుకంటే… ఇంట్లోకి చొరబడాలనుకునేవాళ్లు కొద్దిగా అయినా.. భయపడతారని. ఇప్పుడు… అమరావతిలో ఇళ్ల యజమానులు.. చాలా కొత్తగా ఇదే పద్దతని అవలంభిస్తున్నారు. ముఖ్యంగా కరకట్ట మీద భవనాలు కట్టుకున్న వారు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హడావుడి చూసి… సింపుల్‌గా… ఓ నిర్ణయం తీసుకున్నారు. నోటీసులు అంటించడానికి సీఆర్డీఏ అధికారులు వస్తున్నారని తెలుసుకుని.. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా.. తమకు ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ డీటైల్స్‌ను.. చాలా పెద్దగా రాసి… బోర్డుకు వేలాడదీస్తున్నారు.

చంద్రబాబు ఉంటున్న ఇల్లు యజమానికి లింగమనేని రమేష్‌కు.. ఈ ఐడియా రాలేదేమో కానీ.. కరకట్ట పక్కనే ఉన్న ఇతర ఇళ్ల యజమానులకు వచ్చింది. దాదాపుగా అందరూ.. బడాబాబులే కావడంతో… తమ పర్మిషన్ వివరాలతో బోర్డు తయారు చేసి.. గేటుకు వేలాడదీస్తున్నారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన అధికారులకు ఆ బోర్డులు షాకిస్తున్నాయి. వాటిపై వివరాలు రాసుకుని… సీఆర్డీఏ ఆఫీసుకు వెళ్లి ఫైల్స్ వెదుకుతున్నారు. కానీ.. ఆ పర్మిషన్లు అన్నీ సీఆర్డీఏ ఏర్పడక ముందు.. 2004 నుంచి 2014 మధ్యలో తెచ్చుకున్నవే.

ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు ” విజయవాడ – గుంటూరు – తెనాలి – మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ” వీజీటీఎం ఉడాకు చైర్మన్ గా ఉన్నప్పుడు.. ఇచ్చిన పర్మిషన్లే అవి. అప్పుడు సీఎంగా వైఎస్ ఉన్నారు. చివరికి చంద్రబాబు ఉంటున్న లింగమనేని ఎస్టేట్ కి కూడా.. అప్పట్లోనే పర్మిషన్లు వచ్చాయి. ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చి .. ఇప్పుడు ఆ ప్రభుత్వమే అక్రమం అని నోటీసులిస్తే… ఎలా అనే వాదన వినిపిస్తోంది. వైఎస్ హయాంలో ఇచ్చిన పర్మిషన్ల గుట్టును బయటకు తీస్తే.. ఎవరి మెడకు చుట్టుకుంటుందోనని.. ఆందోళన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close