ఇక ‘శ్రీ‌దేవి’ బ‌యోపిక్‌పైనే చూపుల‌న్నీ..

‘మ‌హాన‌టి’గా సావిత్రి బ‌యోపిక్‌కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఓ క‌థానాయిక జీవితాన్ని ఎలా చెప్పాలో, ఎలా చెబితే జ‌నం చూస్తారో చెప్ప‌డానికి ‘మ‌హాన‌టి’ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. ఈ స్ఫూర్తితో మ‌రిన్ని బ‌యోపిక్‌లు మ‌న ముందుకొచ్చే అవ‌కాశాలున్నాయి. అంద‌రికంటే ముందు శ్రీ‌దేవి బ‌యోపిక్ ప‌ల‌క‌రించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే.. బోనీక‌పూర్ ఈ సినిమాకి సంబంధించిన క‌స‌ర‌త్తులు మొద‌లెట్టిన‌ట్టు స‌మాచారం. కొన్ని టైటిళ్లు కూడా రిజిస్ట‌ర్ చేసి పెట్టుకున్నాడు. స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. 2019లో ఈ సినిమాని మొద‌లెట్టే అవ‌కాశాలున్నాయి. అయితే.. శ్రీ‌దేవి పాత్ర‌లో ఎవ‌రు క‌నిపించ‌నున్నారు అనేదే ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇప్పుడు త‌మ‌న్నా ‘శ్రీ‌దేవి పాత్ర నేను చేయ‌డానికి సిద్ధం’ అంటోంది. శ్రీ‌దేవి క‌థానాయిక‌గా న‌టించిన `హిమ్మ‌త్‌వాలా`ని రీమేక్ చేసినప్పుడు ఆ పాత్ర శ్రీ‌దేవికే ద‌క్కింది. ప్ర‌చార చిత్రాల్లో త‌మ‌న్నాని చూసి ‘జూనియ‌ర్ శ్రీ‌దేవి’ అంటూ హిందీ వాళ్లు కితాబులు ఇచ్చారు. అయితే ఆ సినిమా ఫ్లాపై త‌మ‌న్నా ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. ఇప్పుడు ‘శ్రీ‌దేవి’ బయోపిక్ త‌మ‌న్నాకి మ‌రో గొప్ప అవ‌కాశం. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు. మూడు చోట్లా తెలిసిన క‌థానాయిక‌నే తీసుకోవాల‌న్న‌ది బోనీ ఆలోచ‌న‌. ఆ లెక్క‌న ఆలోచిస్తే త‌మ‌న్నాకు మంచి ఛాన్సే ఉంది. కానీ బోనీ మ‌దిలో శ్రీ‌దేవిగా ఎవ‌రు మెదులుతున్నారో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close