ఎన్టీఆర్‌కి ఓ ‘జై’ వేస్కోండి!

ఈ శ్రీ‌రామ‌న‌వ‌మికి మంచి గిఫ్టే ఇచ్చాడు ఎన్టీఆర్‌. త‌న కొత్త సినిమా పేరు ప్ర‌క‌టించ‌డ‌మే కాదు, లోగో కూడా చూపించాడు. మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశాడు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఎన్టీఆర్ – బాబి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రానికి ‘జై ల‌వ‌కుశ‌’ అనే పేరు పెట్టొచ్చ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు ఆ పేరే ఖాయం చేశారు.. అదీ… కాస్త ముందుగానే చెప్పేసి అభిమానుల్ని ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్‌కి గురి కాకుండా చూసుకొన్నారు. లోగో చూస్తుంటే పాత ల‌వ‌కుశ గుర్తొస్తుంది. మోష‌న్ పోస్ట‌ర్‌కి ఇచ్చిన ఆర్‌.ఆర్‌.., లోగో డిజైన్… ఇవ‌న్నీ సంప్ర‌దాయ‌బ‌ద్దంగా క్లాసీగా ఉన్నాయి. క‌ల్యాణ్ రామ్ నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ చిత్రంలో ఓ క‌థానాయిక‌గా రాశీ ఖ‌న్నాని ఎంచుకొన్న సంగ‌తి తెలిసిందే. మ‌రో నాయిక పాత్ర స‌మంత‌కు ద‌క్కిన‌ట్టు ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభిన‌యం పోషిస్తున్న చిత్ర‌మిది. మూడు పాత్ర‌ల పేర్లు క‌లిసొచ్చేలా జై ల‌వ‌కుశ అనే పేరు పెట్టారు. అందులో ఓ పాత్ర నెగిటీవ్ ల‌క్ష‌ణాల‌తో ఉంటుంద‌ట‌. ఈ సినిమాలో ప్ర‌త్యేకంగా విల‌న్స్ అంటూ ఎవ‌రూ ఉండ‌ర‌ని, ఎన్టీఆరే విల‌న్‌గా క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆ పాత్ర కోస‌మే ఎన్టీఆర్‌ని ప్ర‌త్యేకంగా తీర్చిదిద్ద‌బోతున్నారు. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ నుంచి మేక‌ప్ నిపుణుల్ని కూడా తీసుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close