ఒకేరోజు ప్రారంభమై, ఒకేరోజు రిలీజ్‌ అవనున్న ఇద్దరు టాప్‌ హీరోల సినిమాలు

‘శ్రీమంతుడు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివ తన నెక్స్‌ట్‌ మూవీ అదే బేనర్‌లో ఎన్టీఆర్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ‘జనతా గ్యారేజ్‌’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో ప్రారంభమవుతోంది.

తమిళ్‌లో సూపర్‌ డూపర్‌హిట్‌ మూవీగా నిలిచిన ‘తని ఒరువన్‌’ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్‌, ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ కూడా ఫిబ్రవరి 22నే ప్రారంభమవుతోంది.
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి ఇద్దరు టాప్‌ హీరోలతో ఇద్దరు టాప్‌ డైరెక్టర్స్‌ చేస్తున్న ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ ఒకేరోజు ప్రారంభమవడమే కాదు, రెండు సినిమాలనూ ఒకేరోజు రిలీజ్‌ చెయ్యాలని ఫిక్స్‌ అవ్వడం కూడా విశేషమే. ఆగస్ట్‌ 12న ‘జనతా గ్యారేజ్‌’ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తుండగా, అదేరోజు రామ్‌చరణ్‌ చిత్రాన్ని కూడా రిలీజ్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు దర్శకనిర్మాతలు. దాదాపు ఆర్నెల్లు ముందుగానే రిలీజ్‌ డేట్‌ని రిజర్వ్‌ చేసుకున్న ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోటీ వుంటుందో గానీ ఈ విషయంలో డిస్కషన్స్‌ మాత్రం తారాస్థాయికి చేరుకోబోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close