జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత క‌న్‌ఫ్యూజ్ అయ్యాను: ఎన్టీఆర్‌

ఎన్టీఆర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్… ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూకుడుమీదున్నాడు. జ‌న‌తాగ్యారేజ్ త‌ర‌వాత క‌చ్చితంగా చాలా పెద్ద ద‌ర్శ‌కుడితోనే సినిమా చేస్తాడ‌నుకొన్నారంతా. కానీ అనూహ్యంగా బాబికి అవ‌కాశం ద‌క్కింది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి ఫ్లాప్ ఇచ్చినా, బాబిని కావాల‌ని ఎంచుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎన్టీఆర్ బాగా క‌న్‌ఫ్యూజ్ అయిపోయి, ఈనిర్ణ‌యం తీసుకొన్నాడేమో అనిపించింది. అయితే… బాబిని ద‌ర్శ‌కుడిగా ఎంచుకోవ‌డానికి అస‌లు రీజ‌న్ చెప్పాడు ఎన్టీఆర్‌. ఆదివారం హైద‌రాబాద్‌లో జై ల‌వ‌కుశ పాట‌లు విడుద‌ల‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ బాబి విష‌యంలో క్లారిటీ ఇచ్చాడు.

”జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత నేను చాలా క‌న్‌ఫ్యూజ్‌లో ఉన్నాను. ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాలేదు. మ‌న‌సుకి న‌చ్చిన సినిమా చేయాలా, లేదంటే ట్రెండ్ ఫాలో అయిపోవాలో అర్థం కాలేదు. ఈ ద‌శ‌లో బాబి నాకు ఈ క‌థ వినిపించాడు. క‌థ విన‌గానే.. మ‌న‌సుకు న‌చ్చిన ఇలాంటి సినిమానే చేయాల‌నిపించింది. నా కెరీర్‌లో నేను చేసిన ది బెస్ట్ స్క్రిప్ట్ ‘జై ల‌వ‌కుశ‌’. మూడు పాత్ర‌ల్లో న‌టించే అవ‌కాశం ఓ న‌టుడికి అరుదుగా ద‌క్కుతుంది. ఈ సినిమాని కేవ‌లం ఓ సినిమా చూడ‌డం లేదు. మా నాన్న‌కు ష‌ష్టి పూర్తి కానుక ఇవ్వాల‌నుకొన్నాం. మా అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఇస్తున్న కానుక ఇదే. ఈనెల 2వ తారీఖున ఈ సినిమాని విడుద‌ల చేద్దామ‌నుకొన్నాం. 2 అయితే ఏంటి? 21 అయితే ఏంటి? మా అమ్మానాన్న‌లు, మా పిల్ల‌లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీస్తే చాలు. అది ఇదే..” అంటూ ‘జై ల‌వ‌కుశ‌’ గురించి చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close