బాల‌య్య‌కు క్రిష్ కండీష‌న్లు

ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి దర్శ‌కుడిగా తేజ త‌ప్పుకోవ‌డంతో ఆ బాధ్య‌త‌లు బాల‌కృష్ణ తీసుకోవ‌డం దాదాపుగా లాంఛ‌న‌మే. అయితే ఈలోగా ఆయ‌న చివ‌రిసారి క్రిష్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నించిన‌ట్టు తెలుస్తోంది. ఇది వ‌ర‌కే క్రిష్‌ని సంప్ర‌దించినా `మ‌ణిక‌ర్ణిక‌` చేతిలో ఉండ‌డం మూలంగా బాల‌య్య ప్ర‌తిపాద‌న‌ని అంగీక‌రించ‌లేక‌పోయాడు. ఈసారి ఏమైనా వీలు కుదురుతుందేమో అని… బాల‌య్య మ‌రోసారి క్రిష్ ని ఈ విష‌య‌మై మ‌రోసారి సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ `ఓకే` చేయ‌డానికి క్రిష్ కొన్ని కండీష‌న్లు విధించిన‌ట్టు స‌మాచారం. అందులో ప్ర‌ధాన‌మైన ష‌ర‌తు.. స్క్రిప్టు మార్చిరాయ‌డం. ఇప్ప‌టికే ఎన్టీఆర్ బ‌యోపిక్ స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్ధ‌మైంది. డైలాగుల‌తో స‌హా రెడీ అయ్యాయి. కానీ క్రిష్ మాత్రం ”ఎన్టీఆర్ చిత్రాన్ని నా కోణంలో తీయాల‌నుకుంటున్నా. స్క్రిప్టు విష‌యంలో క‌ల‌గ‌జేసుకోక‌పోతే.. ఈ బాధ్య‌త తీసుకుంటా” అన్నాడ‌ట‌. అంతేకాదు. టెక్నిక‌ల్ టీమ్‌లో కూడా త‌న‌కు న‌చ్చిన‌వాళ్లే ఉండాల‌ని, అన్నింటికంటే ముఖ్యంగా మ‌ణిక‌ర్ణిక విడుద‌ల అయ్యాకే… ‘ఎన్టీఆర్’ బ‌యోపిక్ ప‌నులు మొద‌లెడ‌తాన‌ని చెప్పాడ‌ట‌. ఈకండీష‌న్ల‌కు బాల‌య్య ఒప్పుకోలేక‌పోతున్నాడ‌ని, స్క్రిప్టు మార్చ‌డం దాదాపు అసాధ్యం అని చెప్పాడ‌ని, దాంతో క్రిష్ ఈ ప్రాజెక్టు వ‌దులుకున్నాడ‌ని తెలుస్తోంది. ఈమ‌ధ్య‌లో కొంత‌మంది ‘ఈ సినిమా చేయ‌కు’ అంటూ స‌ల‌హాలూ ఇచ్చార‌ని స‌మాచారం. అందులో ఓ అగ్ర ద‌ర్శ‌కుడు కూడా ఉన్నాడ‌ని తెలుస్తోంది. అయితే ఇవేం ప‌ట్టించుకోకుండా బాల‌య్య రంగంలో దిగ‌బోతున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close