ఎన్టీఆర్ సినిమా ఎవరితోఉండబోతోంది? అనే విషయం తెలీక ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఎన్టీఆర్కొత్త సినిమా కబుర్లేం లేక… వాళ్లకు చాలా బోర్ కొట్టేసుంటుంది. ఎప్పుడైతే బాబితో సినిమా అనేది కన్ఫామ్ అయ్యిందో అప్పటి నుంచీ ఎన్టీఆర్ సినిమా గురించి రోజుకో కొత్త వార్త పుట్టుకొచ్చేస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడం, ఒక్కో ఎన్టీఆర్ పక్కన ఒక్కో హీరోయిన్ ఫిక్సయిపోవడం ఇవన్నీ హాట్ టాపిక్కులుగా మారాయి. ఓకే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కనిపించే సరికి ఈ సినిమా ఓ గ్లామర్ ప్యాక్ లా ఉండబోతోందని అభిమానులు ఆల్రెడీ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అయితే ఎన్టీఆర్ ముగ్గురు హీరోయిన్లతో సరిపెట్టడం లేదు. మరో హీరోయిన్ నీ తీసుకొంటారట.
అంటే ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లన్నమాట. అయితే నాలుగో హీరోయిన్ కేవలం ఐటెమ్ పాటలో మాత్రమే కనిపిస్తుందని సమాచారం. ఐటెమ్ పాటలో కనిపించబోయే హీరోయిన్ స్టార్ భామే అని తెలుస్తోంది. ఆ కథానాయిక ఎవరన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఎలాగూ.. ఐటెమ్ పాట తెరకెక్కించడానికి కనీసం ఐదారు నెలల సమయం ఉంది. అందుకే అప్పుడే కథానాయికని ఫిక్స్ చేసుకోవడం ఎందుకని.. చిత్రబృందం లైట్ తీసుకొంది. మొత్తానికి ఎన్టీఆర్ సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉండమన్నది ఖాయం అయిపోయింది. ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించే అవకాశం ఉంది. ఇటీవల బాబి, అనిరుథ్ ల మధ్య కథకు సంబంధించిన డిస్కర్షన్స్ జరిగినట్టు తెలుస్తోంది. సంక్రాంతి అయిపోయాక షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయని, ప్రస్తుతం ప్రతినాయకుడి పాత్ర కోసం అన్వేషణ జరుగుతుందని టాక్.